Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: ప్రభాస్ "రాధే శ్యామ్" నుంచి.... గూస్ బంప్స్ అప్డేట్

Radhe Shyam: ప్రభాస్ “రాధే శ్యామ్” నుంచి…. గూస్ బంప్స్ అప్డేట్

Radhe Shyam: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విడుదల చేసిన ట్రైలర్‌ రాధేశ్యామ్‌పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ప్రభాస్‌ క్యారెక్టర్‌, రాధాకృష్ణ మేకింగ్‌ స్టైల్‌తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

thaman going to do back ground music for prabhas radhe shyam movie

ఇదిలా ఉండగా తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చింది. రాధేశ్యామ్‌ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఇప్పుడు రాధేశ్యామ్‌ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం యంగ్‌ సెన్సేషన్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ను రంగంలోకి దింపారు మేకర్స్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలకు తమన్‌ నేపథ్య సంగీతాన్ని అందించనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

దీంతో ఈ అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం తమన్‌ ఇటీవల బ్యాక్‌గ్రౌండ్‌ అందించిన ‘అఖండ’కు మంచి రెస్పాన్స్‌ రావడమే. మరి తమన్‌ మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్, ప్రాజెక్టు కె, స్పిరిట్ ​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version