Indian Currency: అమెరికా డాలర్ తో పోలిస్తే ఏ దేశ మారకం విలువ అయినా తక్కువే. డాలర్ తో పోలిస్తే మన రూపాయి విలువ రూ.74 గా ఉంది. కానీ మన దేశానికంటే చాలా దేశాల రూపాయి విలువ తక్కువగా ఉండటం తెలిసిందే. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ విలువే ప్రామాణికంగా చెల్లిస్తుంటారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల్లో స్థిరపడే వారికి డబ్బు విలువ చూసుకుంటుంటారు. ప్రపంచ దేశాల్లో రూపాయి మారకం విలువను లెక్కగడితే పలు విషయాలు తెలుస్తున్నాయి.
దక్షిణాసియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న వియత్నాంలో ఆకట్టుకునే బీచ్ లు, సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. సందర్శకులను ఆకర్షించే ఈ దేశ రూపాయి విలువ మన దేశంతో పోలిస్తే రూ.305 డాంగ్ గా ఉంది. దీంతో ఇక్కడ రూ.100 సంపాదిస్తే వియత్నాం కరెన్సీలో 30,570.95 డాంగ్ లుగా చలామణి అవుతుంది.
ఆసియా ఖండంలో మరో దేశం ఇండోనేషియా. ఇక్కడ పర్వతాలు, పురాతన హిందూ దేవాలయాలు, బౌద్ధాలయాలు అలరిస్తాయి. మన రూపాయి విలువ ఈ దేశంతో పోలిస్తే రూ.193 ఎక్కువ. మన దేశంలో రూ.100 లు ఉంటే అక్కడ 19,301తో సమానం. దీంతో మన రూపాయికి ఇండోనేషియాలో కూడా ఎక్కువ వస్తుంది.
ఇస్లామిక్ దేశమైన ఉబ్జెకిస్తాన్ లో కూడా మన రూపాయి విలువ అక్కడి రూ.144తో సమానం. అంటే ఇక్కడి రూ.100 లతో పోలిస్తే అక్కడ 14,422 తో సమానం. దీంతో మన దేశ రూపాయికి విదేశాల్లో మంచి స్థానమే దొరుకుతోంది. వ్యాపారులు ఇక్కడ సంపాదించి అక్కడ ఖర్చు చేస్తే తక్కువ ఉంటుందని తెలుస్తోంది.
ఇంకా థాయిలాండ్, వియత్నాం, మయన్మార్ దేశాలకు పొరుగున ఉండే లావోస్ లో కూడా మన కరెన్సీకి విలువ ఎక్కువ ఉంటుంది. మన రూపాయి వారి రూ.140 కి సమానం. భారతీయ కరెన్సీలో రూ.100 లు లావోస్ కరెన్సీలో రూ.14,071 గా ఉంటుంది.
పరాగ్వేలో కూడా మన కరెన్సీ(Indian Currency) విలువ ఎక్కువగానే ఉంటోంది. మన రూపాయి ఇక్కడ రూ.92తో సమానం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నావికాదళం ఉన్న దేశంగా గుర్తింపు పొందిన పరాగ్వే లో మన రూ.100 లు అక్కడి కరెన్సీలో 9,286తో సమానమని గుర్తించాలి.
కాంబోడియాలో కూడా మన రూపాయి విలువ రూ.54గా ఉంది. ఇక్కడి రూ.100 లు సంపాదిస్తే అక్కడ 5,488తో సమానం అని తెలుసుకోవాలి. కొలంబియా దేశంలో కూడా మన రూపాయి విలువ రూ.52తో పెసోలుగా ఉంది. దీంతో మన దగ్గర రూ.100 లకు అక్కడ రూ.5,219 పెసోలతో సమానం.
రష్యా, చైనా దేశాలతో సరిహద్దు గల మంగోలియాలో కూడా మన రూపాయికి రూ.38 టగ్రిలతో సమానం. మన దగ్గర రూ.100లకు అక్కడ 3849 టగ్రిలు వస్తాయి. దక్షిణ కొరియాలో కూడా మన రూపాయి రూ.15 వాన్ లతో సమావనం. దీంతో పాటు చిలీలో రూ.10, శ్రీలంకలో రూ.2, పాకిస్తాన్ లో రూ.2, నేపాల్ లో రూ.1.60లతో సమానంగా ఉంది.
దీంతో చాలా దేశాల కరెన్సీ మనకంటే తక్కువ అని తెలుస్తోంది. కానీ అమెరికా కరెన్సీ అయితే మనకంటే 74 రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.
Also Read: సీఎంకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన కేంద్ర మంత్రి.. కేసీఆర్ ఎలా స్పందిస్తారో ?
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Indian rupee exchange rate is high in most countries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com