Allu sirish: అల్లు కుటుంబం నుంచి వచ్చి.. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోల్లో ఒకరు అల్లు శిరీష్. అయితే, తాజాగా, ఈ హీరో అభిమానులకు షాకింగ్ న్యూస్ ప్రకటించారు. సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో శిరీష్ పెద్దగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా కనిపించడంలేదు. అయితే, తాడాగా, లైన్లోకి వచ్చి సామాజిక మాద్యమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు. ఇది తనకు చాలా స్పెషల్‌డేగా వర్ణిస్తూ లాస్ట్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

ట్వీట్లో ఈ ఏడాది నవంబరు 11వ తేదీ నాకు చాలా స్పెషల్. వృత్తి పరంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. త్వరలోనే విషయం ఏంటనేది క్లారిటీ ఇస్తా. అప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు పెళ్లి ఏమైనా కుదిరిందా అని అడిగారు. అందుకు సమాధానంగా.. నేను వృత్తిపరంగా స్పెషల్ డే అన్నాను. అంటూ రిప్లై ఇచ్చారు శిరీష్. మరో నెటిజన్ ఒకరు హాలీవుడ్ ఏమైనా వెళ్తున్నారా అని అడగ్గా.. అలాంటి ఆశలేమీ లేవు.. కొత్త సినిమా కుదిరింది.. కథ కూడా బాగా నచ్చింది. నా కెరీర్లో బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందనిపిస్తోంది. అంటూ మిస్టరీని రివీల్ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్ ప్రేమ కాదంట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అల్లు శిరీష్.