Jabardasth Promo: ప్రతి వారం వారం వెరైటీ స్కిట్లతో వచ్చి కడుపుబ్బా నవ్విస్తూ ఉండే జబర్దస్త్ కార్యక్రమం తాజాగా ఒక ప్రోమోని విడుదల చేసింది. ఈ టీవీ లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. వచ్చేవారం జరగబోయే జబర్దస్త్ ప్రోమో లో మనో, ఇంద్రజ న్యాయ నిర్ణేతలుగా… వ్యాఖ్యాతగా అనసూయ వ్యవహరిస్తున్నారు.
ఎప్పుడూ కొత్తరకమైన కాన్సెప్ట్స్ తో, వివిధమైన పంచులతో కామెడీ ని పండిస్తూ… స్కిట్ ని విజయవంతంగా ప్రదర్శించే హైపర్ ఆది; ఈ వారం కూడా అదే విధంగా తనదైన కామెడీ టైమింగ్ తో పంచులు విసురుతూ జబర్దస్త్ ప్రోమో లో కనిపించాడు. ప్రతి వారం లేదా వీలు చిక్కినప్పుడల్లా తన స్కిట్ లలో గెస్ట్ లు,సెలెబ్రిటీలు మెరుస్తూ ఉంటారు. అయితే ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో, సుడిగాలి సుధీర్ టీం నుండి ఆటో రామ్ ప్రసాద్, ఆది తో కలిసి పంచులు విసురుతూ, కామెడీ తో నవ్వులు పూయిస్తూ కనిపిస్తాడు.
ఈ నేపథ్యం లో ఆటో రామ్ ప్రసాద్, ఆది ప్రోమో ఎంట్రీ లోనే కనిపిస్తారు. పంచ్ ఉన్నది కౌంటర్ లేదు.. వాట్ అమ్మా వాట్ ఈజ్ ధిస్ అమ్మా అంటూ నేను శైలజ సినిమాలోని పాటకి డాన్స్ వేస్తారు. సచ్చి పోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటన్న అని ఆది అడగ్గా… నాకు బస్సు పడదు కదరా అంటూ ఆటో పంచ్ వేసాడు ఆటో రామ్ ప్రసాద్. ఈ క్రమం లో రైజింగ్ రాజు ఎంటరవుతుంటే… ఏంటి సర్ సుసైడ్ చేసుకోవడానికి వచ్చారా అంటూ ఆటో రామ్ ప్రసాద్, రైసింగ్ రాజుని నిలదీయగా… అవును సర్ అని రాజు బదులిస్తే, దీనికి ఎందుకు సర్ ఇంత దూరం వచ్చారు… సుసైడ్, పోలీస్ కేసు వాటితో టైం వేస్ట్, మిరే కొద్దీ రోజులు ఉంటే పోతారుగా అని సమాధానమిస్తాడు ఆటో రామ్ ప్రసాద్.