https://oktelugu.com/

భారత వైద్యురాలికి అమెరికా సెల్యూట్..

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా మహమ్మరి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతంలో ప్రపంచంలోని అన్నిదేశాలకు కరోనా వైరస్ సోకింది. చైనాయేతర దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలడుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ లాంటి దేశాలు కరోనాతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమెరికా ప్రస్తుతం తగు మూల్యం చెల్లించుకుంటోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతోన్నాయి. ఈతరుణంలో ప్రవాస భారతీయ […]

Written By: , Updated On : April 21, 2020 / 07:23 PM IST
Follow us on


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా మహమ్మరి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతంలో ప్రపంచంలోని అన్నిదేశాలకు కరోనా వైరస్ సోకింది. చైనాయేతర దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలడుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ లాంటి దేశాలు కరోనాతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమెరికా ప్రస్తుతం తగు మూల్యం చెల్లించుకుంటోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతోన్నాయి.

ఈతరుణంలో ప్రవాస భారతీయ వైద్యులు అమెరికాలో కరోనా మహమ్మరిపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ అమెరికన్లకు అండగా నిలుస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనాపై పోరాడుతున్నారు. ఇప్పటికే అమెరికాకు అవసరమైన హైడ్రోక్లోరోక్వీన్ మందులను భారత్ పంపి ప్రాణదాతగా నిలిచింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయులు చేస్తున్న సేవలను గుర్తించిన అమెరికన్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.

కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఉమా మధుసూదన్ అమెరికాలోని సౌత్ విండ్సార్ ఆస్పత్రిలో ఎన్నో ఏళ్లుగా వైద్యురాలిగా సేవలందిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆమె విశేషంగా సేవలందిస్తుంది. ఇలాంట విపత్కర పరిస్థితుల్లో ఆమె సేవలను గుర్తించిన అమెరికన్లు వైద్యురాలు ఉమా మధుసూదన్ ఇంటి ముందుకు చేరుకొని పెద్దఎత్తున వాహనాలతో పేరేడ్ నిర్వహిస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ప్రవాస భారతీయులు సుమారు 50వేల వైద్యులు సేవలు అందిస్తున్నట్లు సమాచారం. అమెరికన్లు ఉమా మధుసూదన్ ఇంటి ఎదుట వాహనాలతో పేరేడ్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.