నాలుగో రీమేక్ లో నటించబోతున్న సమంత

పెళ్ళైన తరవాత సమంత అక్కినేని లో చాలా మార్పు కనపడుతోంది . ఇదివరకటి లాగా ఏ సినిమా బడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. సెలెక్టివ్ గా వెళుతోంది . పెళ్లయిన తర్వాత `రంగస్థలం’ ,` మహానటి ` , `మజిలీ ` వంటి మంచి సినిమాలు చేస్తూ..మరపురాని విజయాలు ఖాతాలో వేసుకున్న సమంత మధ్యలో రీమేక్ చిత్రాలు చేసింది. ` యూ టర్న్` , `ఓ బేబీ’, `జాను `అనే మూడు రీమేక్ చిత్రాలు చేసింది. […]

Written By: admin, Updated On : April 21, 2020 7:12 pm
Follow us on


పెళ్ళైన తరవాత సమంత అక్కినేని లో చాలా మార్పు కనపడుతోంది . ఇదివరకటి లాగా ఏ సినిమా బడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. సెలెక్టివ్ గా వెళుతోంది . పెళ్లయిన తర్వాత `రంగస్థలం’ ,` మహానటి ` , `మజిలీ ` వంటి మంచి సినిమాలు చేస్తూ..మరపురాని విజయాలు ఖాతాలో వేసుకున్న సమంత మధ్యలో రీమేక్ చిత్రాలు చేసింది. ` యూ టర్న్` , `ఓ బేబీ’, `జాను `అనే మూడు రీమేక్ చిత్రాలు చేసింది. ఆ మూడు చిత్రాలు నటిగా సమంత కి మంచి పేరు తెచ్చి పెట్టాయి. దాంతో మరోసారి ఓ రీమేక్ చిత్రంలో నటించాలి అనుకొంటోంది సమంత. నిజానికి ‘జాను’ చిత్రం ప్లాప్ అయిన తర్వాత సమంత ఇక రీమేక్‌ చిత్రాల జోలికి వెళ్ల దని అంతా అనుకొన్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సమంత ఓ కన్నడ రీమేక్ చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకొంది.

ఈ ఏడాది ఫిబ్రవరి లో కన్నడలో విజయం సాధించిన ‘దియా’ ఇపుడు తెలుగులో రీమేక్ అవుతోంది ..కాగా ఈ ప్రేమకథ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశం కనిపిస్తోంది.నిజానికి ఈ చిత్రం లవ్‌స్టోరీ అయినప్పటికీ ఇందులో పాటలు, ఫైట్లు ఏమీ ఉండవు . .. కథ, కథనం ఈ సినిమాకు మూలస్తంభాల్లా నిలిచి ఈ సినిమా ని హిట్ చేశాయి. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ..కాగా ఈ ట్రయాంగిల్ స్టోరీ లో సమంత తో పాటు నాగచైతన్య, నాగశౌర్య నటిస్తారని తెలుస్తోంది .ఇంకో విశేషం ఏమిటంటే సమంత , నాగ చైతన్య కాంబినేషన్ లో ఇది ఐదో చిత్రంగా రాబోతుంది .