Smriti Mandhana: దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ లో స్మృతి అదరగొడుతోంది. ఈ సిరీస్లో భారత్ ఫైనల్ వెళ్ళగా.. ఆతిధ్య శ్రీలంక కూడా ఫైనల్ వెళ్ళింది. భారత్ – శ్రీలంక మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని కొలంబో మైదానంలోని ప్రేమ దాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.. ఈ మ్యాచ్లో భారత్ టాస్ నెగింది.. బ్యాటింగ్ చూజ్ చేసుకుంది. స్మృతి మందాన(116) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత మహిళల జట్టు 7 వికెట్ల నష్టానికి 342 రన్స్ చేసింది.. శ్రీలంక బౌలర్లలో మల్కి, విహంగ, కుమారి తలా రెండు వికెట్లు సాధించారు. స్మృతి తన ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టింది. తద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది.
54 సిక్సర్లు..
శ్రీలంక జట్టుపై రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా స్మృతి సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేలలో భారత జట్టు తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన మహిళా క్రికెటర్ గా నిలిచింది. 102 ఇన్నింగ్స్ లలో స్మృతి 54 సిక్సర్లు కొట్టింది. ఆ తర్వాత ఇస్తానాలలో హర్మన్ ప్రీత్ 53, రీచా ఘోష్ 21 ఉన్నారు. ఇక మొత్తంగా వన్డేలలో మహిళా క్రికెటర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ డాటిన్ 91 తో తొలి స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఈ సిరీస్ లో భారత్ నాలుగు మ్యాచ్లు ఆడగా.. మూడు విజయాలు సాధించింది. శ్రీలంక జట్టుపై రెండు మ్యాచ్లు ఆడగా.. ఒకదాంట్లో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా జట్టుతో రెండు మ్యాచులు ఆడగా.. రెండిట్లోనూ విజయం సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకతో తలపడుతున్న భారత్.. సిరీస్ ను గెలిచే విధంగా కనిపిస్తోంది. ఈ కథనం రాసే సమయానికి శ్రీలంక జట్టు విజయానికి 155 పరుగుల దూరంలో ఉంది.. ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోయింది. అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక గెలవడం దాదాపు అసాధ్యం. ఈ మ్యాచ్లో స్మృతి ప్రారంభం నుంచి అదరగొట్టింది. శ్రీలంక బౌలర్లను బెదరగొట్టింది. దూకుడుగా ఆడి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు సూపర్ సెంచరీ తో ప్రేమ దాస మైదానంలో సంచలనం సృష్టించింది. టీమిండియా భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారణం స్మృతి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిగతా ప్లేయర్లు దూకుడుగా ఆడినప్పటికీ.. వారు బలమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. స్మృతి మాత్రం ప్రారంభం నుంచి శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి తన సత్తా ఏమిటో నిరూపించింది. ముఖ్యంగా బౌండరీలతో విరుచుకుపడి స్కోరుబోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించింది.