Operation Sindoor: నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో నరేంద్ర మోడీపై విమర్శలు పెరిగిపోయాయి. వార్ మధ్యలో ఎందుకు నిలిపివేశారు అంటూ కొంతమంది నెటిజన్లు, కొన్ని రాజకీయ పార్టీలు ఆయనను విమర్శించడం ప్రారంభించాయి. దీంతో భారత జనతా పార్టీకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రధానం మంత్రి మోది కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది..” ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. ముష్కర దేశం ఫైరింగ్ చేస్తే.. ఇండియా కూడా కౌంటర్ ఫైరింగ్ చేస్తుంది. ఈ మేరకు త్రివిధ దళాలకు నరేంద్ర మోడీ కీలక ఆదేశాలు ఇచ్చారు. ముష్కర దేశంతో పిఓకే, టెర్రరిస్టులను హ్యాండ్ ఓవర్ చేయటం తప్ప మరే అంశంపై డిస్కషన్స్ అవసరం లేదు. ఆ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని అంగీకరించబోమని” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వచ్చింది. దీంతో చాలామంది నోర్లు మూతపడ్డాయి .. అంటే ముష్కర దేశానికి మొసళ్ల పండుగ చూపించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చారు.. అంతేకాదు యుద్ధం పై రకరకాల విమర్శలు చేస్తున్న వారందరికీ ఒక్కసారిగా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. నరేంద్ర మోడీ ప్రకటనతో ప్రపంచ దేశాలు కూడా సైలెంట్ అయిపోయాయి. అటు అమెరికా.. ఇటు ఇతర దేశాలు కూడా ఏం జరుగుతుందని ఆసక్తిగా చూస్తున్నాయి.
అమెరికా చెప్పడంతో..
అమెరికా చెప్పడంతో నరేంద్ర మోడీ ఫైరింగ్ స్టాప్ చేయడానికి ఓకే అన్నారు. కానీ ఉగ్రవాద దేశం నక్కజిత్తులు ప్రదర్శించింది. బార్డర్లో ఫైరింగ్ మళ్ళీ మొదలుపెట్టింది. ముఖ్యంగా జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాలలోని బార్డర్ విలేజెస్ లో ఇష్టానుసారంగా మిస్సైల్స్ ప్రయోగించింది. ఇది కాస్త ఇండియాకు ఇబ్బందికరంగా మారింది. దీంతో మళ్ళీ ఫైరింగ్ ప్రారంభించింది. అయితే ఫైరింగ్ స్టాప్ చేయడం పట్ల ప్రధానమంత్రి పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అగ్రరాజ్యం మందు తలవంచారని.. పిఓకేను హ్యాండ్ ఓవర్ చేసుకునే క్రమంలో వెన్ను చూపించారని ఆరోపణలు వినిపించాయి. అయితే వీటికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో బిజెపి పడిపోయింది. ఇదే క్రమంలో కాంగ్రెస్.. ఇతర పార్టీలు రెచ్చిపోయాయి. ఓవర్ నైట్ లో బిజెపికి వచ్చిన హైప్ ను మొత్తం తగ్గించాయి. అయితే దానిని కాపాడుకునే ప్రయత్నంలో నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన రావడంతో ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. పాకిస్తాన్ ను ఏం చేస్తారో నని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాద దేశానికి సంబంధించిన పది ఎయిర్ బేస్ లను భారత్ భస్మీ పటలం చేసింది. ఇప్పుడు తాజాగా సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీనికి తగ్గట్టుగానే నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఉండడంతో ముష్కర దేశానికి పెద్ద పండుగ ఏదో చూపించబోతున్నారని నెట్టింట చర్చ జరుగుతుంది. అదే గనుక జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండడం కాస్త కష్టమే.