Ban Single-Use Plastic: జూలై 1 నుంచి ఒక్కసారి మాత్రమే వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేదించింది. పైగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకంతోపాటు ఉత్పత్తి, దిగుమతి, పంపిణీ, నిల్వ, అమ్మకంపై కూడా నిషేధం విధియించారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం చాలా మంచిది. అయితే.. ఈ నిర్ణయం కారణంగా ఫ్రూటీ, రియల్, ట్రోపికానా, మాజా వంటి కూల్ డ్రింక్స్ కంపెనీలకు పెద్ద సవాలు ఎదురుకానుంది.

కానీ, నింగి, నేల, నీరు కాలుష్యం బారిన పడకుండా పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2022, జులై 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి రాబోతుంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దశల వారీగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజన్ తో ఉన్నారని చెప్పింది.
Also Read: Dissent Leaders In YCP: వైసీపీ నేతల్లోనే అసమ్మతి కుంపట్లా? ఏం జరుగుతోంది?
జులై 1 నుంచి నిషేధించే ప్లాస్టిక్ వస్తువుల జాబితా
ప్లాక్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్
బుడగలకు ఉపయోగించే ప్లాస్టిక్ పుల్లలు
ప్లాస్టిక్ జెండాలు
క్యాండీ స్టిక్స్‌ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ పుల్లలు
అలంకరణ కోసం వినియోగించే థెర్మకోల్
ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు
మిఠాయి డబ్బాలకు చుట్టే ప్లాస్టిర్ రేపర్లు, ప్యాకేజింగ్ రేపర్లు
ఆహ్వాన పత్రికలు
సిగరెట్ పెట్టెలు
100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు
కాఫీ, టీ కలుపుకొనే పుల్లలు

ఇక ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ప్రత్యామ్నాయాల తయారీకి సాంకేతిక సహాయాన్ని అందించడం కోసం MSME యూనిట్ ల కొరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ లను కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు లేకపోయినా ఇబ్బంది లేదు అని భరోసా ఇస్తున్నారు.
Also Read:KCR Tamilsai: ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. ‘పగోళ్ల’తో ఈ పకపక నవ్వులూ..!