Dissent Leaders In YCP: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో ఏం జరుగుతోంది. నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అభిప్రాయ భేదాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరు తమ తోటి వారినే అనుమానించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి నోరు విప్పారు. తనపై కుట్రలు చేస్తున్నారంటూ రచ్చకెక్కారు. దీంతో తన రాజకీయ మనుగడకు ఎదురు వస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. దీంతో నేతల్లో సమన్వయం కొరవడుతోందని తెలుస్తోంది. ఎక్కడో ఒక చోట నోరు విప్పుతూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. తమ రహదారికి అడ్డు వస్తే ఇక ఓర్చుకునేది లేదని తెగేసి చెబుతున్నారు.
మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం స్పందించారు. తనను సైతం నియోజకవర్గంలో బలహీనం చేయాలని కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సొంత పార్టీలోనే వేరు కుంపట్లు పెట్టినట్లు మాటల యుద్ధం కొనసాగుతుండటంతో నేతల్లో అయోమయం నెలకొంది. భవిష్యత్ లో పార్టీ విజయం సాధించాలంటే అందరు సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతల పరిస్థితిలో మార్పు వస్తోంది.
Also Read: Tamil Star Hero: వైసీపీ MLA గా పోటీ చెయ్యబోతున్న తమిళ స్టార్ హీరో
దీంతో రాబోయే ఎన్నికల్లో విభేదాలు ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఒకరికి మరొకరికి పడక పార్టీని అదోగతి పాలు చేస్తారనే వాదనలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధినేత జగన్ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి చోద్యం చూస్తున్నారనే తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ విభేదాలు తలనొప్పిగా మారనున్నాయని తెలుస్తోంది. ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా సొంత పార్టీ నేతల్లోనే ఐక్యం లేకపోతే ఇక వారు ప్రత్యర్థి పార్టీపై ఏం ప్రభావం చూపుతారనే ప్రశ్నలు వస్తున్నాయి.
మొత్తానికి ఆంధ్రలో వైసీపీకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సొంత పార్టీలోనే అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీ నేతల తీరు కూడా అలాగే కొనసాగుతోంది. దీంతోనే పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని భావిస్తున్న వైసీపీకి అసమ్మతి వాదులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్ మారే అవకాశాలే కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా నేతల్లో ముదిరిని విభేదాలను తొలగించి పార్టీ నేతల్లో ఐక్యత సాధిస్తేనే విజయ తథ్యమని తెలుస్తోంది.
Also Read:CM KCR Visits Raj Bhavan: కేసీఆర్ కాంప్రమైజ్.. రాజ్‌భన్‌కు వచ్చిన సీఎం.. తమిళిసైతో మాటామంతి!