spot_img
Homeజాతీయ వార్తలుAK-203 rifles: భారత్ అమ్ములపొదిలో శక్తిమంతమైన ఏకే రైఫిల్స్.. రష్యా సహకారంతో తయారీ..

AK-203 rifles: భారత్ అమ్ములపొదిలో శక్తిమంతమైన ఏకే రైఫిల్స్.. రష్యా సహకారంతో తయారీ..

AK-203 rifles: భారత్ అమ్ములపొదిలోకి శక్తిమంతమైన ఆయుధాలు రాబోతున్నాయి. ఏకే-203 రైఫిల్స్‌ను రష్యా దేశ టెక్నాలజీ సాయంతో భారత్ తయారు చేసుకోబోతున్నది. ఇప్పటి వరకు ఇండియా ఇన్సాస్ రైఫిళ్లను ఉపయోగించింది. ఈ రైఫిల్స్‌తో భారత్ ఇంకా శక్తిమంతమైన దేశంగా అవతరించనుంది. శత్రువుపై దాడి చేసే క్రమంలో భారత్‌కు ఈ ఆయుధాలు ఉపయోగపడతాయి. ఈ పవర్ ఫుల్ ఏకే-203 రైఫిల్స్‌పై ఫోకస్..

AK-203 rifles
AK-203 rifles

చాలా కాలం నుంచి అనగా 30 ఏళ్ల నుంచి భారత సైన్యం ఇన్సాస్ రైఫిళ్లను ఉపయోగిస్తోంది. వీటి ప్లేస్‌లో 6 లక్షల ఏకే-203 రైఫిల్స్ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇన్సాస్ రైఫిల్స్ కంటే చాలా పవర్ ఫుల్‌గా ఉండే ఈ వెపన్స్ ద్వారా భారత సైన్యం ఇంకా బాగా పని చేయగలదు. ఈ రైఫిల్స్ భారత్‌లో తయారు చేసేందుకు అవసరమైన టెక్నాలజీ సాయం చేస్తామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన విషయాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో భారత్‌కు పవర్ ఫుల్ ఏకే-203 రైఫిల్స్ తయారీ విషయంలో సహకారంపై ఓకే చెప్పారు.

ఇన్సాస్ రైఫిల్స్ కంటే ఏకే-203 రైఫిల్స్ వెయిట్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇన్సాస్ రైఫిల్ 4.15 కేజీల వెయిట్ ఉండగా, ఏకే-203 రైఫిల్స్ 4.15 కేజీస్ వెయిట్ ఉంటుంది. ఇక ఈ ఏకే రైఫిల్ 300 మీటర్ల డిస్టెన్స్‌లో ఉండే టార్గెట్‌ను ఈజీగా ఛేదించగలుగుతుంది. అలా శత్రువుపై ఏకే వేగంగా దాడి చేయగలదు. ఈ రైఫిల్స్ తయారీకి భారత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ సమీపంలోని కోర్వాలో యూనిట్ నెలకొల్పింది. ఇది భారత్, రష్యా జాయింట్ వెంచర్. కాగా, ఇక్కడ శక్తిమంతమైన ఏకే రైఫిల్స్ తయారు కానున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ రైఫిల్స్ తయారు చేయనున్నారు. ఇందుకు రష్యా దేశం సహకరించనుంది.

Also Read: BJP: మిషన్-2023.. బీజేపీలోకి ఉద్యమ నేతలు.. చేరికలతో బీజీబీజీ..!

ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ అందించేందుకు రష్యా అంగీకరించింది. టెక్నాలజీ అందించినందుకు భారత్ రష్యాకు రాయల్టీ చెల్లింపు మాఫీ చేయబోతుంది. ఇందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ రూ.5 వేల కోట్లకు పైనే ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకే భారత్ ఈ విధమైన అడుగులు వేసింది. అధునాతనమైన, శక్తిమంతమైన ఆయుధాలు, యుద్ధ సామగ్రి ఉంటేనే భారత సైన్యం శత్రువును అతి తక్కువ సమయంలో మట్టుబెట్టగలదు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రైఫిల్స్ తయారీకి ఒప్పందం చేసుకుంది.

Also Read: Mamata Banerjee: మమతా బెనర్జీ నేతృత్వంలోనే మూడో కూటమి ఏర్పాటు జరిగేనా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper