Mamata Banerjee: దేశంలో మూడో కూటమి దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే అది కాంగ్రెస్ తో సాధ్యం కాదని తెలుస్తోంది. ఇప్పటికే మునిగిపోతున్న నావలా మారిన కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా లేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్సేతర కూటమికి అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడో కూటమి ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆమె హైదరాబాద్ పర్యటనకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కూడా బీజేపీపై కోపం పెంచుకున్న క్రమంలో వీరంతా మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ నేతృత్వంలోనే మూడో కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు. గతంలోనే ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తో భేటీ అయి మూడో కూటమి ఏర్పాటుపై ఓ ప్రణాళిక రెడీ చేసినట్లు తెలుస్తోంది. దీనికోసమే దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని చూస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా బీజేపీపై కోపంతోనే మూడో కూటమి కావాలని ఆశిస్తున్నారు. అది కాంగ్రెస్ తో సాధ్యం కాదని తెలుసుకునే మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆమెను హైదరాబాద్ కు రావాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో మూడో కూటమి ఏర్పాటుకు అంకురార్పణ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీని కోసమే అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా నానాటికి తగ్గిపోతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ రోజురోజుకు దిగజారిపోతోంది. అన్ని ప్రాంతాల్లో అధికారానికి దూరమైపోతోంది. దీంతో నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ కు సత్తా లేదని తెలుస్తోంది. దీంతో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ను కూడా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: BJP: మిషన్-2023.. బీజేపీలోకి ఉద్యమ నేతలు.. చేరికలతో బీజీబీజీ..!
టీఆర్ఎస్ కు హుజురాబాద్ ఓటమి మింగుడు పడటం లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ తన ప్రభావం చూపించడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీంతో రాష్ర్టంలో బీజేపీని రానివ్వకుండా చేయాలంటే ఇంకో కూటమి రావాల్సిందే అని భావిస్తోంది. ఇందుకోసమే మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపుతోంది. మరో వైపు మూడో కూటమి కాంగ్రెస్ తో అంటే చాలా రాజకీయ పార్టీలు వెనకడుగు వేసే ప్రమాదమున్నందున మమతా బెనర్జీ సారధ్యంలోనే థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
మొత్తానికి కాంగ్రెసేతర పక్షాలతోనే మూడో ఫ్రంట్ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. అయితే గతంలో పీకే కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగినా తరువాత ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోనే మూడో కూటమి పురుడు పోసుకుంటే బాగుంటుందనేది ఆయన వాదనగా కనిపిస్తోంది. దీని కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం.