https://oktelugu.com/

Chandrababu: చంద్రబాబుకు ఏం కాదా?

అయితే ఓ మాజీ సీఎంకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడాన్ని మీడియా లైట్ తీసుకుంది. హిందుస్థాన్ టైమ్స్ ప్రత్యేక కథనం వెలువరించగా... తెలుగు మీడియాకు సంబంధించి మాత్రం సాక్షిలోనే ప్రాధాన్యం లభించింది.

Written By: , Updated On : September 4, 2023 / 10:57 AM IST
Chandrababu

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అస్మదీయ కంపెనీల నుంచి రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. టిడిపి హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి ఈ ముడుపులు అందినట్లు ఐటీ శాఖ తనిఖీల్లో వెల్లడయ్యింది. దీంతో చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు అభ్యంతరాలను తోసిపుచ్చింది. తాజాగా ఆగస్టు 4న మరో నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఓ మాజీ సీఎంకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడాన్ని మీడియా లైట్ తీసుకుంది. హిందుస్థాన్ టైమ్స్ ప్రత్యేక కథనం వెలువరించగా… తెలుగు మీడియాకు సంబంధించి మాత్రం సాక్షిలోనే ప్రాధాన్యం లభించింది. ఎల్లో మీడియాలో కానీ.. తటస్థ మీడియాలో కానీ ఎక్కడా వచ్చిన దాఖలాలు లేవు. నోటీసులే కదా లైట్ తీసుకున్నారో.. లేక చంద్రబాబుపై ఇటువంటి ఆరోపణలు వచ్చినా రుజువు కావని భావించారో కానీ ఈ వార్తకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే చంద్రబాబుకు నోటీసులు ప్రక్రియ ఇప్పటిది కాదని.. గత మూడేళ్లుగా జరుగుతున్న తంతు అని తెలుస్తోంది.

బిజెపి అగ్రనేతలతో చంద్రబాబు సయోధ్యకు ఈ కేసే కారణమని విపక్షం ఆరోపిస్తుంది. అయితే ఈ చిన్నపాటి నోటీసుకు చంద్రబాబు బెదిరిపోతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఈపాటికే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు అన్ని విధాలా జాగ్రత్తలు పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు. తొలుత ఐటీ శాఖల పరిధితో నోటీసుల ప్రక్రియకు చంద్రబాబు అడ్డుకట్ట వేయగలిగారు. ప్రస్తుతం కమిషనర్ స్థాయి అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. వ్యవస్థల్లో చంద్రబాబు కంటూ సొంత మనుషులు ఉన్నారు. వారే తనను గట్టున పడేస్తారని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. నాలుగు రోజుల హడావుడి నడిచే ఈ కేసును చంద్రబాబు లైట్ తీసుకోవడానికి.. వ్యవస్థలో తన మనుషులే కారణమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

గతంలో ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే సమయంలో ఫోన్ టాపింగ్ అంశాన్ని బయటికి తీసుకు రాగలిగారు. ఓటుకు నోటు కేసుకు మించి ఫోన్ టాపింగ్ నేరమని వ్యవస్థలతోనే కెసిఆర్ కు చెప్పించారు. దీంతో కెసిఆర్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం నడిచింది. ఇప్పుడు కూడా ఈ ఆదాయ పన్ను కేసులో చంద్రబాబు తప్పనిసరిగా లూప్ హోల్స్ వెతుకుతారు. అటు వ్యవస్థల్లో సహకరించే మనుషులు ఉన్నారు. అందుకే చంద్రబాబుకు ఈ కేసులో ఏమీ కాదన్నా అభిప్రాయం సర్వత్ర వినిపిస్తోంది.