IAF: భారత వాయుసేన(ఐఏఎఫ్) మరో అరుదైన ఘనత సాధించింది. నైట్ విజన్ గాగుల్స్(ఎన్వీజీ)సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో సీ–130జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఈ ప్రక్రియ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఐఏఎఫ్ ఎక్స్‌లో షేర్ చేసింది. ఒక వీడియోలో ఎన్వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానం లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఆకుపచ్చగా దృశ్యాలు..
నైట్ విజన్ గాగుల్స్(ఎన్జీవీ) కావడంతో వీడియోలో దృశ్యాలు ఆకుపచ్చరంగులో భిన్నంగా కనిపిస్తున్నాయి. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా తమ శక్తిసామర్థ్యాలను పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన తెలిపింది.
ఐఏఎఫ్ బలోపేతం..
నైట్ విజన్ గాగుల్స్ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లో, రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి సెర్చ్ ఆపరేషన్లు నిర్వమించడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ప్రధానంగా మన పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ రాత్రిపూట నిర్వహిస్తున్న ఆక్రమణలు, దాయాది దేశం చీకట్లో చేపట్టే చొరబాట్లపై ఆపరేషన్‌కు ఈ టెక్నాలజీ దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Iaf conducts successful night vision goggles aided landing in eastern sector
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com