Surya Vamsam: ఒకప్పుడు సీనియర్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు అందరూ ఇప్పుడు హీరోలుగా, లేదా సైడ్ క్యారెక్టర్లుగా నటిస్తూ మెప్పిస్తున్నారు. శ్రీవిద్య, కావ్య కళ్యాణ్ రామ్, తేజ సజ్జా వంటి తారలు ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫేమస్ అవుతున్నారు. అంతేకాదు కొందరు ఏకంగా స్టార్లుగా నిలిచారు. హనుమాన్ సినిమాతో తేజా సజ్జ స్టార్ స్టేటస్ ను సంపాదించార కూడా. కానీ కొందరు మాత్రం సినిమాలకు దూరం ఉంటూ ఇతర వ్యాపారాలతో బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఓ చైల్డ్ ఆర్టిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా?
ఆనంద్ హర్షవర్ధన్ గుర్తున్నాడా? తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా కనిపించి మెప్పించాడుఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్. తన నటనతో అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి జంటగా నటించిన ప్రియరాగాలు సినిమాలో సౌందర్య కొడుకుగా కనిపించాడు కూడా.. ఈయన అమాయకపు నటనకు కన్నీళ్లు పెట్టుకునే వారు ఎందరో. ఈ సినిమా ఒకటే కాదు ఇతర హీరోల సినిమాల్లో కూడా కనిపించి మెప్పించాడు. మరి వెంకటేశ్ నటించిన సూర్యవంశం సినిమా గుర్తుందా?
అందమైన మొహం, అమాయకపు నటనను చూసి ఎవరు అయినా ఫిదా అవ్వాల్సిందే. అదే విధంగా సూర్యవంశం సినిమాలో నటించారు ఈ చైల్డ్ ఆర్టిస్ట్. వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలలో నటించిన సూర్యవంశం సినిమాలో వెంకీ కుమారుడిగా నటించి ఎంతో మందిని ఆకట్టుకున్నాడు హర్షవర్దన్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు. ఆనంద్ హర్షవర్దన్ ప్రముఖ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ పిబీ శ్రీనివాస్ మనవడు అని మీకు తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం సినిమాలో వాల్మికీ, బాల హనుమాన్ పాత్రలు పోషించాడు ఈ నటుడు. అంతేకాదు వెంకటేశ్ నటించిన ప్రేమించుకుందాం రా మూవీ వెంకీ మేనల్లుడిగా కనిపించాడు హర్ష.
తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా నటించి మెప్పించాడు. పెళ్లి పీటలు, ప్రేయసి రావే, తిరుమల తిరుపతి వెంకటేశ, మనసంతా నువ్వే, ఇంద్ర, తొలి చూపులోనే, నేనున్నా్ను వంటి సినిమాల్లో తనదైన పాత్ర పోషించి మెప్పించాడు. హిందీలో రీమేక్ చేసిన సూర్యవంశం సినిమాలో అమితాబ్ కొడుకుగా కనిపించాడు కూడా. అలాగే కన్నడలోనూ ఓ సినిమా చేశాడు.
మరి బాలనటుడిగా మాత్రమే పరిచయం అయినా ఈ నటుడు సీనియర్ గా సినిమాల్లో సెట్ అయ్యాడా లేదా అని ఆలోచిస్తున్నారా? ఇక బాలనటుడిగా దాదాపు 25 సినిమాల్లో నటించిన ఆనంద్.. ఆ తర్వాత చదువు దృష్ట్య సినిమాలకు దూరమయ్యాడు. అయితే హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసిన ఆనంద్…తిరిగి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన హర్ష ప్రస్తుతం హీరోగా ఆన్ ది వే అనే సినిమా చేస్తున్నాడు. ఒక సినిమా మాత్రమే కాదు నిదురించు జహాపన అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి పోస్టులు పెడుతూనే ఉంటాడు.