
కరోనా కారణంగా ఏపీ బడ్జెట్ సమావేశాలను కుదించారు. గురువారం ఒక్కరోజే నిర్వహించి రూ.2,29,779 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గతేడాది రూ. 2,24,789 కాగా ఈసారి జగన్ ప్రభుత్వం రూ.5 కోట్లకు పెంచింది. బడ్జెట్ పై చర్చ, ఆ తరువాత ఆమోదించి సమావేశాన్ని ముగించారు. అయితే ఈ బడ్జెట్ పై ఎలాగూ ప్రతిపక్షాల విమర్శలు ఉండే ఉంటాయి. అయితే ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం న్యాయం చేయలేదని సోషల్ మీడియాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ భారీ ప్రయోగాన్ని చేపట్టింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కీలకమని ఆ ప్రాంతాలకు సమన్యాయం చేయాలని భావించింది. అందులో భాగంగా మూడు రాజధానులు అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ ఉండాలని నిర్ణయించింది. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదింపచేసింది. అయితే ఈ మూడు రాజధానుల విషయంలో తీర్మానం తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అర్థమవుతోంది.
అయితే ప్రతిపక్షాలు, కోర్టులు మూడు రాజధానుల విషయంలో అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. అంతేకాకుండా అందుకు అవసరమైన నిధులను కూడా సమకూరుస్తామన్నారు. అయితే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మూడు రాజధానుల ప్రస్తావన రాలేదు. కనీసం ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించలేదు.
దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.ప్రభుత్వం మూడు రాజధానులకు సమన్యాయం చేస్తానని చెబతుంది గానీ.. అందుకు సంబంధించిన నిధులెందుకు విడుదల చేయదని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానులకు అడ్డంకులు ఏర్పడినా ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయొచ్చుగా..? అని అంటున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి..