
కరోనా చికిత్స ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించాడు. కొవిడ్ బారినపడి నిరుపేదలు అల్లాడుతున్నారని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిని సందర్శించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే గాంధీకి వెళ్లిన ఆయన ఏ సమస్యలు పరిష్కరించారో చెప్పాలన్నారు. ఆస్పత్రిలో పూర్తిస్థాయి సౌకర్యాలు లేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ విమర్శించారు.