సంతోష్ నగర్ కు చెందిన 20 సంవత్సరాల యువతిని నలుగురు ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి పహాడీషరీఫ్ లో అత్యాచారం జరిపినట్లు సమాచారం. అయితే సదరు యువతి వారి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి చెప్పిన ఆధారాలతో విచారణ చేపట్టారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు పహాడీ షరీఫ్ లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. యువతిని ఆ నలుగురు ఆటోడ్రైవర్లు ఎప్పుడు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఆటోలో కిడ్నాప్ చేసిన విధానంపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. దొరికిన ఆధారాలతో పక్కా వ్యూహంతో నిందితులను పట్టుకోవడానికి ప్రణాళిక రచిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అత్యాచారాల పరంపర కొనసాగడంపై అందరిలో విస్మయం కలుగుతోంది.
ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం జరిగిందని వచ్చిన ఫిర్యాదుతో ఉలిక్కిపడిన పోలీసులకు వరుస సంఘటనలు కలవరపెడుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాల గోల వెలుగులోకి రావడంతో జనం సైతం భయాందోళన చెందుతున్నారు. తమ పిల్లల భవితవ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత పకడ్బందీగా సీసీ కెమెరాలు ఉన్నా అత్యాచారాలు చోటుచేసుకోవడం దారుణంగా చెబుతున్నారు. దీంతో పోలీసులు పక్కా చర్యలు తీసుకుని అత్యాచారాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.