
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంఫ్టాన్ తీవ్ర విమర్శలు చేశారు. చెత్తమాటలు మాట్లాడటంలో కోహ్లీ నెంబర్ వన్ అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రోజు పై ప్రశంసలు కురిపిస్తునే కోహ్లీపై విమర్శలు చేయడం గమనార్హం. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, లెజెండర్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పై ప్రశంలస వర్షం కురిపించిన నిక్ కాంప్టన్ కోహ్లీ పై మాత్రం తీవ్ర ఆరోపణలు చేశాడు. నిక్ కాంప్టన్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. అండర్సన్.. అశ్విన్ ని హేలన చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు. బుమ్రాపై విమర్శులు చేసినప్పు ఏం చేశావ్ అంటూ ప్రశ్నించారు. 2012 నాటి సంఘటనకు ఇప్పుడు ఏడుస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.