Corona Vaccine for childrens: చిన్నారులకు టీకా.. ఎప్పుడంటే?

దేశంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా టీకాలు వేసేసుకున్నారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలతో ప్రజలకు రక్షణ ఏర్పడుతోంది. ఇప్పటిదాకా 18-65 ఏళ్ల పైబడిన వారికి టీకాలు వేశారు. అయితే చిన్నపిల్లలు, 18 ఏళ్లలోపు వారికి ఇంకా టీకా అందుబాటులోకి రాకపోవడంతో వారంతా బయటకు రాలేని పరిస్థితులున్నాయి. దీంతో పాఠశాలుల తెరువక వారి చదువులు అటకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. కోవాగ్జిన్ తయారు చేసిన […]

Written By: NARESH, Updated On : August 19, 2021 1:36 pm
Follow us on

దేశంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా టీకాలు వేసేసుకున్నారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలతో ప్రజలకు రక్షణ ఏర్పడుతోంది. ఇప్పటిదాకా 18-65 ఏళ్ల పైబడిన వారికి టీకాలు వేశారు. అయితే చిన్నపిల్లలు, 18 ఏళ్లలోపు వారికి ఇంకా టీకా అందుబాటులోకి రాకపోవడంతో వారంతా బయటకు రాలేని పరిస్థితులున్నాయి. దీంతో పాఠశాలుల తెరువక వారి చదువులు అటకెక్కుతున్నాయి.

ఈ క్రమంలోనే కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. కోవాగ్జిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ నుంచి మరో రెండు నెలల్లో చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ‘ఎఫ్ఐ హెల్త్ కేర్ సమ్మిట్’లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ టీకాను రెండు సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు వారికి ఇవ్వొచ్చని.. ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినట్టు భారత్ బయోటెక్ సీఎండీ తెలిపారు. టీకా పూర్తి భద్రత ఇస్తుందని.. ఇప్పటికే రోగనిరోధక శక్తి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. టీకాకు సంబంధించి పూర్తి వివరాలు మరో నెలరోజుల్లో వెల్లడిస్తామన్నారు.

టీకా క్లినికల్ ట్రయల్స్ పై భారత ఔషధ నియంత్రణ మండలి సంతృప్తి చెందితే టీకాకు అనుమతి లభిస్తుందని.. ఇదంతా జరిగేందుకు రెండు నెలల సమయం పడుతుందని భారత్ బయోటిక్ ఎండీ తెలిపారు. కోవిడ్, రేబిస్ రెండింటికి ఒకే టీకా ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

ఇక ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కూడా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది. ఇది రెండు మూడు నెలల్లో క్లినికల్స్ పూర్తి కానున్నాయి. నాసల్ వ్యాక్సిన్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాక్సిన్ వ్యాపించదని.. ఇంజెక్షన్ల ద్వారా మాత్రం ఇది వ్యాపిస్తుందని చెబుతున్నారు.