అర్ధ నగ్నంగా నర్స్ లను వేధిస్తున్న మర్కజ్ రోగులు

ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్న వాహనాలుగా భావిస్తున్న మర్కజ్ జమాత్ సమ్మేళనంలో పాల్గొన్న వారిని గుర్తించి, వైద్య పరీక్షలకు పంపించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషమ పరీక్షగా మారగా, తాజాగా ఆసుపత్రులలో వారి విశృంఖల ప్రవర్తన, వైద్యులపై దాడులు, నర్స్ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పోలీస్ అధికారులకే దిక్కు తోచడం లేదు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మృతి చెందడంతో అతని బంధువులు డాక్టర్లపై దాడి జరిపిన […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 12:48 pm
Follow us on


ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్న వాహనాలుగా భావిస్తున్న మర్కజ్ జమాత్ సమ్మేళనంలో పాల్గొన్న వారిని గుర్తించి, వైద్య పరీక్షలకు పంపించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషమ పరీక్షగా మారగా, తాజాగా ఆసుపత్రులలో వారి విశృంఖల ప్రవర్తన, వైద్యులపై దాడులు, నర్స్ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పోలీస్ అధికారులకే దిక్కు తోచడం లేదు.

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మృతి చెందడంతో అతని బంధువులు డాక్టర్లపై దాడి జరిపిన వంటి సంఘటనలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆ సంఘటనపై పోలీసులు, ప్రభుత్వం తీవ్రంగా స్పందించినా గాంధీ ఆసుపత్రిలోనే ఇంకా రోగులు, వారికి సహాయకులుగా వచ్చిన వారు నర్స్ లకు సహకరించకుండా, వారిని వేధిస్తున్నారని, అసభ్యంగా వారి పట్ల ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.

గాంధీ ఆసుపత్రిలో ఇప్పుడు నర్సులు వార్డులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అక్కడ పనిచేస్తున్న వార్డు బాయిలు, సెక్యూరిటీగార్డులు సైతం భయం నీడలో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో జరిగిన అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో అత్యవసర సమావేశంలో ఆస్పత్రిలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రిలో వారి ప్రవర్తన అదుపు తప్పి అసహ్యకర రీతికి మారింది. అర్ధనగ్నంగా తిరుగుతూ, నర్స్ లను వేధిస్తున్నట్లు అక్కడి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమ ఆసుపత్రిలో చేరిన చేరిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గురువారం రాత్రి పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.

ఆసుపత్రిలో చేరిన ఆరుగురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ప్యాంట్లు తీసివేసి అర్ద నగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొత్వాలీ ఘంటాఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురు రోగులు సిగరెట్లు, బీడీలు కావాలని డాక్టర్లు, నర్సులను డిమాండ్ చేస్తున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన ఆరుగురు కరోనా రోగులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఎంఎంజీ ఆసుపత్రి నర్సులు ఫిర్యాదు చేశారని చీఫ్ మెడికల్ ఆఫీసరు చెప్పారని ఘజియాబాద్ నగర ఎస్పీ చెప్పారు. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలు పాటించని తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ తో పాటు ఏడుగురికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వీరు ఆసుపత్రులలో శాంతి, భద్రతల సమస్యలు సృస్టిస్తున్నందున తగు పోలీస్ రక్షణ కోరుతూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమీషనర్ కు లేఖ వ్రాసింది. తుగ్లకాబాద్ స్వీయ నిర్బంధానం కేంద్రములో ఉన్నవారు డాక్టర్లు, నర్స్ లపై ఉమ్మి వేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అంటూ ఉత్తర రైల్వే సిపిఆర్ఓ దీపక్ కుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు.