తెలంగాణలోని కరోనా హాట్ స్పాట్ లు ఇవే..

దేశంలో కరోనా ఎంట్రీ కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ కొనసాగనుంది. దీంతో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. అయితే గత రెండు, మూడురోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పాజిటివ్ కేసులన్నీంటికి ఢిల్లీ మర్కస్ ప్రార్థనలకు లింకు ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కరోనా హాట్ స్పాట్ లుగా గుర్తించింది. కరోనా సోకి కూడా […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 3:24 pm
Follow us on


దేశంలో కరోనా ఎంట్రీ కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ కొనసాగనుంది. దీంతో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. అయితే గత రెండు, మూడురోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పాజిటివ్ కేసులన్నీంటికి ఢిల్లీ మర్కస్ ప్రార్థనలకు లింకు ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కరోనా హాట్ స్పాట్ లుగా గుర్తించింది.

కరోనా సోకి కూడా ఇన్నాళ్లు బయటకు చెప్పని ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం హాట్ స్పాట్స్‌గా పేర్కొంటుంది. రాష్ట్రంలోని భైంసా, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ పాతబస్తీ, గద్వాల్, మిర్యాలగూడను హాట్ స్పాట్స్‌గా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాల్లో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు చాలా ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించింది. వీరి వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇప్పటికే వీరిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది.

రాష్ట్రంలో గుర్తించిన హాట్ స్పాట్స్‌లో మూడు కిలోమీటర్ల ఏరియా వరకు ఎవరినీ అనుమతించరు. ఈ ప్రాంతం నుంచి ఎవరిరీన బయటికి వెళ్లకుండా కట్టడి చేయనున్నారు. అదేవిధంగా బయట నుంచి ఇతరులను ఈ ప్రాంతాలకు ఎవరినీ అనుమతించరు. కాగా తెలంగాణలో ఇప్పటివరకు 154కరోనా పాజిటివ్ కేసులు నమదయ్యాయి. వీరిలో 17మంది కోలుకున్నారు. తొమ్మిది మంది మృతిచెందారు. గత రెండు మూడురోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు బయటపడతుండంతో సర్కార్ అలర్ట్ అయింది. లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.
Also Read: ఒవైసీ హాస్పిటల్‌‌ను ఐసోలేషన్ వార్డుగా చెయ్యరే!