https://oktelugu.com/

Harishrao:ప్లీనరీలో హరీశ్, కవితలు ఎక్కడ..? ఎందుకు రాలేదు..?

అంగరంగ వైభవంగా టీఆర్ఎస్ 20 వార్షికోత్సవ సభ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. ముఖ్య నాయకులు వేదికపై ఆసీనులైయ్యారు. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఆశ్యక్యత, సాధించిన విజయాలను కొనియాడారు. ముందు ముందుజరగబోయే ప్రణాళికల గురించి తెలియజెప్పారు. ఇంత పెద్ద వేదికపై ఎందరో నాయకులు కూర్చున్నా.. కేసీఆర్ తో పాటు కేటీఆర్ ప్రసంగాలు హైలెట్ గా నిలిచాయి. మిగతా నాయకులు సైతం వారి […]

Written By: , Updated On : October 26, 2021 / 10:52 AM IST
Follow us on

అంగరంగ వైభవంగా టీఆర్ఎస్ 20 వార్షికోత్సవ సభ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. ముఖ్య నాయకులు వేదికపై ఆసీనులైయ్యారు. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఆశ్యక్యత, సాధించిన విజయాలను కొనియాడారు. ముందు ముందుజరగబోయే ప్రణాళికల గురించి తెలియజెప్పారు. ఇంత పెద్ద వేదికపై ఎందరో నాయకులు కూర్చున్నా.. కేసీఆర్ తో పాటు కేటీఆర్ ప్రసంగాలు హైలెట్ గా నిలిచాయి. మిగతా నాయకులు సైతం వారి ప్రాంతాల అభివృద్ధి గురించి చెప్పారు. అయితే టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఉద్యమ కారుడు హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ఈ ప్లీనరీ సభలో కనిపించలేదు. హరీశ్ రావుకు ఆహ్వానం అందకపోగా.. కవితకు ఆహ్వానం ఉన్నా.. సభకు హాజరు కాలేదు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా హరీశ్ రావు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను డిస్ట్రబ్ చేయడం ఎందుకని ప్లీనరీ సభకు ఆహ్వనం పంపలేదని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే పార్టీ ఆవిర్భాం నుంచి ఉద్యమ కారుడిగా, పార్టీ నాయకుడిగా కీలకంగా ఉన్న ఈ సభలో హరీశ్ రావు లేకపోవడం వెలితిగానే ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. కానీ మరి కొందరు మాత్రం హరీశ్ కు ఆహ్వానం అందకపోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

ఇక టీఆర్ఎస్లో మరో కీలకనేత, ఎమ్మెల్సీ కవితక ఆహ్వానం అందింది. కానీ ఆమె హైదరాబాద్లోనే ఉన్నా సభకు హాజరు కాలేదు. బతుకమ్మ సంబరాల సందర్భంగా దుబాయ్ వెళ్లి రావడంతో జ్వరం ఉందని, అందుకే రాలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. కానీ కేటీఆర్ తో ఉన్న మనస్పర్థల కారణంగానే ఆమె సభకు హాజరు కాలేదని కొందరు అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్ నిర్వహించే సభకు కవిత హాజరు కావడం లేదు. పార్టీలో కీలకంగా ఉన్నా అన్నతో అంతర్గతంగా కలహాలు ఉన్నాయని గుసగుసలాడుతున్నారు.

హుజూరాబాద్ ప్రచారం చేసిన కవిత ప్లీనరీ సభకు హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. కేటీఆర్ తో కొన్ని విషయాల్లో పడకనే ఆమె కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడం లేదని అంటున్నారు. సోమవారం జరిగిన ప్లీనరీ సభ అంతా కేసీఆర్, కేటీఆర్ అన్నట్లుగానే సాగింది. కానీ పార్టీ ఆవిర్భావంలో, పార్టీ అభివృద్ధిలో హరీశ్ రావు లాంటి ముఖ్య నేతలు కూడా ఉన్నారు. కానీ వారికి ఆహ్వనం పంపకపోవడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది.