RRR Movie: ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ కట్ రెడీ… క్లైమాక్స్ మాత్రం అరుపులే

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బాహుబ‌లి మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో సైతం మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న […]

Written By: Raghava Rao Gara, Updated On : October 26, 2021 10:44 am
Follow us on

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బాహుబ‌లి మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో సైతం మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఇటీవలే రాజ‌మౌళి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఫైనల్ కట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. కాగా మూవీ లో 30 నిమిషాల పాటు క్లైమాక్స్ ఉంటుందని… ఇది సినిమాకే మేజర్ హైలెట్ అని సమాచారం. గతంలో సినిమా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్… యాక్ష‌న్ స‌న్నీవేశాల‌ గురించి పలు ఇంటర్వ్యూ ల్లో మాట్లాడడం తెలిసిన విషయమే. ఆయన చెప్పిన దాని కంటే ఎన్నో రేట్లు అధ్బుతంగా చిత్రం తెరకెక్కించినట్లు పలువురు ప్రముఖులు చెబుతున్నారు. అలానే ఈ సినిమా కూడా దాదాపు 3 గంటల వరకు ఉండబోతుందని టాక్ నడుస్తుంది. బాహుబ‌లి సినిమా కూడా రన్ టైమ్ పరంగా ఎక్కువ నిడివి గల సినిమానే… ఆ చిత్రం కంటే ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం మరికొంత టైమింగ్ ను పెంచిన‌ట్టు అనుకుంటున్నారు.

మెగా ఫ్యామిలి, నందమూరి ఫ్యామిలి హీరోలైన రామ్ చరణ్, ఎన్‌టి‌ఆర్ ఈ సినిమాలో కలిసి నటిస్తుండడంతో ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీని వాయిదా వేయగా… వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.