Kavitha: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఘనంగా నిర్వహించింది. పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్లీనరీకి అతిరథ మహారథులు అందరూ విచ్చేశారు. కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం రాకపోవడం అందరికి అనుమానాలు కలిగించాయి. మంత్రి హరీశ్ రావు మాత్రం హుజురాబాద్ ఉప ఎన్నికల హడావిడిలో ఉండి రాలేకపోయినట్లు తెలిసింది. కానీ కవిత రాకపోవడంపై అందరిలో సందేహాలు వ్యక్తమవయ్యాయి.

బతుకమ్మ వేడుకలకు దుబాయ్ వెళ్లిన కవిత ఆదివారమే నగరానికి తిరిగి వచ్చారు. కానీ ప్లీనరీకి మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆమె గైర్హాజరుపై అందరు ఆశ్చర్యపోయారు. ఏ కార్యక్రమమైనా కవిత ఈ మధ్య రాకపోవడంపై అనేక సంశయాలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కవిత ఈసారి మాత్రం ప్లీనరీకి రాకపోవడం ఏమిటనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి.
అయితే దుబాయ్ నుంచి వచ్చిన కవితకు జ్వరం వచ్చిందని అందుకే ఆమె ప్లీనరీకి రాలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దుబాయ్ నుంచి వచ్చేటప్పటికే జ్వరంతో ఉన్నందునే ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్లీనరీకి రాలేదని సమాచారం. ప్లీనరీలో కవిత కనిపించపోవడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
ప్లీనరీకి దుబాయ్ వెళ్లిన ఎమ్మెల్యేలందరు హాజరైనా కవిత మాత్రం కనిపించకపోవడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఉద్దేశపూర్వకంగా రాలేకపోయారా? లేక జ్వరంతోనే రాకపోయారా అనే దానిపై అందరిలో పలు సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతందనే ఉత్కంఠ అందరిలో నెలకొంటున్నట్లు తెలుస్తోంది.