Hanuma Vihari Foundation: ఒకోసారి అవగాహనా లోపంతో తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పుగా అర్థం చేసుకుని ఎదుటివారి కోపానికి గురి కావాల్సి ఉండే అవకాశాలు వస్తాయి. అందుకే ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కురిసిన వర్షాలకు వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల సహాయార్థం చేసిన ఓ కార్యక్రమంలో జరిగిన పొరపాటుతో పెద్ద వివాదమే చెలరేగింది.
భారీ వర్షాలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో తిరుపతిలో హనుమ విహారీ ఫౌండేషన్ సహాయ చర్యలు చేపట్టింది. ప్రజలకు పాలు, బ్రెడ్ వంటివి పంపిణీ చేసింది. అదే సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. ఎవరికి వారు తమ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఏర్పడింది. సేవా కార్యక్రమాల్లో అటు హనుమ విహారీ, ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ లు పాలుపంచుకున్నారు.
ఎవరి ఫొటోలు వారు పోస్టు చేసినప్పుడు హనుమ విహారీ సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులను తమ సంస్థ సభ్యులే అని ప్రకటించింది. దీంతో వివాదం చెలరేగింది. సభ్యులకు టీషర్టులున్నా పట్టించుకోలేదు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్, హనుమ విహారీ సంస్థల మధ్య వివాదం వచ్చింది. తమ సభ్యులను మీ సభ్యులని ఎలా చెబుతారని ప్రశ్నించడంతో హనుమ విహారీ సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ కు క్షమాపణ చెప్పింది. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
Also Read: Jagan: ఆశల్లేని వేళ కేబినెట్ లోకి.. జగన్ సర్ ప్రైజ్
అవగాహన లోపంతోనే తప్పు జరిగినట్లు తెలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని సమాజ క్షేమానికి పాటుపడాల్సిన సంస్థ అర్థంతరంగా బయటకు వెళ్లిపోయింది. అందుకే ఏ విషయమైనా పూర్తిగా అర్థం చేసుకున్నాకే మాట్లాడాల్సి ఉంటుంది. తొందరపడితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఆలోచించే సహనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతో హనుమ విహారీ ట్విటర్ నుంి సామాజిక సేవా కార్యక్రమాల నుంచి తప్పుకుంది.
Also Read: Kapu leaders: హాట్ టాపిక్: టీడీపీలో కాపు నేతలు మౌనం ఎందుకు?