Rajinikanth: చప్పుడు చేయకుండా ఓటీటీలోకి వచ్చిన ‘అన్నాత్తై’

Rajinikanth: సూపర్​స్టార్​ రజనికాంత్​ హీరోగా సిరత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్నాత్తై. తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి కానుగా ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. భారత దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపు 300 కోట్లకుపైగా ప్రపంచవ్యాప్తంగా మార్కును దాటేసినట్లు ఇటీవల నిర్మాతలు వెల్లడించారు. అయితే, మంచిగా కలెక్షన్లు రాబట్టినా.. ఈ సినిమా టాక్​ విషయంలో మిశ్రమ స్పందన లభించింది. తమిళనాడులో […]

Written By: Sekhar Katiki, Updated On : November 25, 2021 3:51 pm
Follow us on

Rajinikanth: సూపర్​స్టార్​ రజనికాంత్​ హీరోగా సిరత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్నాత్తై. తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేసింది చిత్రబృందం. దీపావళి కానుగా ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. భారత దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపు 300 కోట్లకుపైగా ప్రపంచవ్యాప్తంగా మార్కును దాటేసినట్లు ఇటీవల నిర్మాతలు వెల్లడించారు. అయితే, మంచిగా కలెక్షన్లు రాబట్టినా.. ఈ సినిమా టాక్​ విషయంలో మిశ్రమ స్పందన లభించింది. తమిళనాడులో మాత్రం క్రేజీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.

Rajinikanth

అయితే, ఏ సినిమా అయినా థియేటర్​ తర్వాత ఓటీటీలో స్ట్రమింగ్​ అవ్వడం ప్రస్తుతం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే డిజిటల్​ ప్లాట్​ఫామ్​లోనూ తమదైన శైలిలో ప్రచారాలు చేస్తుంటారు దర్శకనిర్మాతలు. కానీ, పెద్దన్న మాత్రం ఎలాంటి చప్పుడు లేకుండా స్ట్రీమింగ్​కు రెడీ అయిపోయాడు. నెట్​ఫ్లిక్స్ వేదికగా తమిళ్​, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలై అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇంకెందుకు ఆలస్యం థియేటర్​లో మిస్​ అయిన తలైవా స్టైల్​ను నెట్​ఫ్లిక్స్​లో చూసేయండి.

Also Read: కోలుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్…ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

ఈ సినిమాలో రజనికాంత్​ హీరో కాగా, కీర్తి సురేశ్​ రజనీ చెల్లెలుగా నటించింది. ఇక మీనా, ఖుష్బు, ప్రకాశ్​ రాజ్​, సూరి, అభిమన్యు సింగ్​, జగపతిబాబు సినిమాలో కీలకపాత్రలు పోషించారు. డి ఇమ్మాన్​ ఈ సినిమాకు సంగీతం అందించారు.

రోబో తర్వాత పెద్దగా హిట్​ అందుకోని రజనీ.. ఈ సినిమాతో కాస్త ఫర్వాలేదనిపించినట్లు తెలుస్తోంది. అయితే, రోబో2.0 సినిమా రజనీకి పెద్ద దెబ్బ వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చిన పెటా, దర్బార్​ వంటి సూపర్​ హిట్​ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే, పెద్దన్నగా రజనీ సత్తా చాటాడనే చెప్పాలి.

Also Read: ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం ఎలా ఉందంటే