తెలంగాణలో సగం మంది కరోనా బాధితులు ఇంటికి

తెలంగాణలో కరొనతో ఆసుపత్రిలలో చేరిన వారిలో దాదాపు సగం మంది కోలుకొని, ఇంటికి వెళ్లారు. అంటే సంగం మంది కోలుకున్నట్లే. ఈ విషయంలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉన్నట్లు చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా బాధితుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. మార్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1082 మందికి వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 12:13 pm
Follow us on


తెలంగాణలో కరొనతో ఆసుపత్రిలలో చేరిన వారిలో దాదాపు సగం మంది కోలుకొని, ఇంటికి వెళ్లారు. అంటే సంగం మంది కోలుకున్నట్లే. ఈ విషయంలో తెలంగాణ దేశంలో ముందంజలో ఉన్నట్లు చెప్పవచ్చు.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా బాధితుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. మార్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1082 మందికి వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరిన వారి సంఖ్య 545 ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 508గా ఉంది.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

అదే విధంగా వైరస్ బారిన పడి 29 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలోనీవే కావడం గమనార్హం. దీంతో పాటు కొత్తగా జగిత్యాల జిల్లాల్లో ఒకరికి వైరస్ సోకింది.

మరోవంక ఆదివారం వైరస్ నుంచి కోలుకోని 46 మంది డిశ్చార్జ్ కాగా, దీనిలో 68 ఏళ్ల వృద్ధుడు సైతం ఉన్నారు. ఇతనికి డయాబెటిక్, న్యూమోనియా సమస్యలు ఉన్నప్పటికీ సుమారు 14 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఇలా ఉండగా, హైదరాబాద్ వనస్థలిపురంలో రోజురోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు కాలనీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు కుటుంబాల ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందనే ఆరోపణలు అధికంగా వస్తున్నాయి. దీంతో వనస్థలిపురంలోని హుడాసాయినగర్, ఎబిటైప్ కాలనీ, ఎస్‌కెడి నగర్, కమలానగర్, సచివాలయనగర్లలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

గత వారం రోజులుగా నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ దాదాపు హైదరాబాద్ నుండే కావడం, ఇక్కడ కూడా మార్కెట్ల నుంచి వస్తుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హోల్‌సేల్ దుకాణాలపై నిఘా పెంచనున్నారు. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాల ద్వారా ఇప్పటికే పలు రిటైల్ డీలర్లకు వైరస్ సోకింది.

కాగా, గత రెండు వారాలుగా తెలంగాణలోని 17 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవని అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట్, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్ జిల్లాల్లో కేసులు లేవు.