సూర్యుడి తో గౌతముడి సినిమా

ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ గారి అభిమాన నటుడు శివ కుమార్ గారి పెద్ద కొడుకు అయిన సూర్య, హీరో గా కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథలకే ప్రాధాన్య మిస్తున్నాడు. సూర్య కెరీర్ లో “పితామగన్ (తెలుగులో శివ పుత్రుడు ), గజిని ” వంటి చిత్రాలు అనేకం ఉన్నాయి ఇక సూర్య సినిమాలు చేసే విషయంలో సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకుంటూ వస్తున్నాడు. తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ […]

Written By: admin, Updated On : May 4, 2020 12:31 pm
Follow us on


ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ గారి అభిమాన నటుడు శివ కుమార్ గారి పెద్ద కొడుకు అయిన సూర్య, హీరో గా కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథలకే ప్రాధాన్య మిస్తున్నాడు. సూర్య కెరీర్ లో “పితామగన్ (తెలుగులో శివ పుత్రుడు ), గజిని ” వంటి చిత్రాలు అనేకం ఉన్నాయి ఇక సూర్య సినిమాలు చేసే విషయంలో సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకుంటూ వస్తున్నాడు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

తన చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా సూర్య వరుస సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం తెలుగు `గురు` ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో “సూరారై పోట్రు ” ( తెలుగులో ఆకాశం నీ హద్దురా ) సినిమాను పూర్తి చేసిన సూర్య , దర్శకుడు హరి నేతృత్వంలో ‘సింగం’ సినిమా కి సీక్వెల్ చేస్తున్నాడు. ఆ తరువాత హిట్ చిత్రాల దర్శకులు శివ ( శౌర్యం , దరువు ఫేమ్ ), వెట్రిమారన్ ( అసురన్ తెలుగులో నారప్ప ).. కార్తీ ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ లను లైన్లో పెట్టేశాడు.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

ఇక ఈ సినిమాల తరవాత ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ` కాక్క కాక్క`( తెలుగులో ఘర్షణ ),` వారణం ఆయిరం `( తెలుగులో సన్ ఆఫ్ సూర్య ) వంటి రెండు భారీ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇటీవలే గౌతమ్ మీనన్ వినిపించిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని , ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది .