Homeజాతీయ వార్తలుమోదీ గుజరాత్ కే ప్రధానా.. నిప్పులు చెరిగిన శరద్ పవర్

మోదీ గుజరాత్ కే ప్రధానా.. నిప్పులు చెరిగిన శరద్ పవర్


పుష్కర కాలం పాటు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన, గుజరాత్ లో తాను చేసిన `నమూనా అభివృద్ధి’ని చూసి ఓట్లు వేస్తే దేశం అంతా అట్లాగే చేస్తానని అంటూ ఓట్లు అడిగి ప్రధానిగా పదవి చేపట్టిన నరేంద్ర మోదీ ఢిల్లీకి వచ్చి ఆరేళ్లయినా గుజరాత్ వాసనలను విడనాడలేక పోతున్నారు.

`గుజరాత్ నమూనా’తో దేశం అంతా అభివృద్ధి చేసే ప్రయత్నం అంటూ ఏమీ చేయలేక పోయారు గాని, గుజరాత్ పారిశ్రామిక వేత్తలకు పెద్ద పీఠం వేయడం, గుజరాత్ కు విశేషమైన ప్రయోజనాలు కేంద్రం నుండి లభించేటట్లు చూడడంతో పాటు గతంలో గుజరాత్ లో తన వద్ద పనిచేసిన అధికారులకు కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు మాత్రం చేబడుతున్నారు. నేడు ఢిల్లీని పాలిస్తున్నది `గుజరాత్ లాబీ’ అనే ప్రచారం ఉంది.

వలస కూలీలకు కాంగ్రెస్ చేయూత!

మోదీ ప్రభుత్వంలో రెండో స్థానం కూడా గుజరాత్ కు చెందిన అమిత్ షా కి ఇచ్చారు. మొన్నటి వరకు బిజెపి అధ్యక్షుడిగా, ఇప్పుడు హోమ్ మంత్రిగా ప్రభుత్వంలోనే కాకుండా, బీజేపీ వ్యవహారాలలో సహితం అమిత్ షా ఆధిపత్యం కొనసాగుతున్నది. తాజాగా అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాన్ని (ఐఎఫ్ఎస్‌సీ) గుజరాత్‌లో ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం మరో వివాదానికి దారితీస్తున్నది.

భారత దేశపు ఆర్ధిక రాజధానిగా పేరొందిన ముంబై ప్రాధాన్యతను తగ్గించి, గుజరాత్ ప్రాధాన్యతను పెంచడం కోసం మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు చాలాకాలంగా విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల అధినేతలు వస్తే తప్పనిసరిగ్గా గుజరాత్ పర్యటన ఉండవలసిందే. గతంలో వలే ముంబైకి రావడం లేదు.

తెలంగాణలో మరో రెండు వారాలు లాక్ డౌన్!

అయితే ముంబైలో కాకుండా ఐఎఫ్ఎస్‌సీని గాంధీ నగర్ లో ఏర్పాటు చేసే ప్రతిపాదన పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవర్ నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా ఆపొరపాటు నిర్ణయమని, అనుచితమని అంటూ ప్రధాని మోదీకి వ్రాసిన లేఖలో తీవ్రమైన ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముంబైకి గల ప్రాధాన్యతను పవర్ గుర్తు చేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలను శరద్ పవార్ ప్రస్తావిస్తూ, ప్రభుత్వ సెక్యూరిటీల పరంగా మహారాష్ట్ర కంటిబ్ర్యూషన్ అసాధారణమని, గుజరాత్‌లో ఐఎఫ్‌ఎస్‌సీ ఏర్పాటు చేయాలనే ఆలోచన పూర్తిగా తప్పుడు సంకేతాలిచ్చే అనుచిత నిర్ణయమని పవర్ హెచ్చరించారు. ఇది మహారాష్ట్ర నుంచి ఆర్థిక సంస్థలు, వ్యాపార సముదాయాలను తరలించేందుకు ఉద్దేశించిన చర్యగా కనిపిస్తోందని విమర్శించారు. ఇందువల్ల అనవసరమైన రాజకీయ అశాంతి తలెత్తుతుందని పవార్ వారించారు.

‘కేంద్రం నిర్ణయంతో దేశానికి ఆర్థికపరమైన నష్టం కలగడమే కాదు, ముంబైకి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతిని కూడా దిగజారుతుంది. ఇండియా జీడీపీలో 6.16, 25 శాతం పారిశ్రామిక ఉత్పత్తి ఇక్కడ్నించే వస్తోంది. దేశ ఆర్థిక లావాదేవీల్లో 70 శాతం మూలధన లావాదేవీలు ముంబై నుంచి జరుగుతున్నాయి’ అని పవార్ ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు.

ఏప్రిల్ 23న ఆర్బీఐ ప్రచురించిన గణాంకాలను పవార్ ప్రస్తావిస్తూ, భారత బ్యాంకింగ్ రంగంలో రూ.145,00,000 కోట్లు డిపాజిట్లు ఉంటే, ఒక్క మహారాష్ట్ర వాటానే 22.8 సాతం ఉందని, ఆ తర్వాత 10 శాతంతో ఢిల్లీ, 7.8 శాతంతో ఉత్తరప్రదేశ్, 7.2 శాతంతో కర్ణాటక, 5.4 శాతంతో గుజరాత్ ఉందని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని, ముంబైకి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను తగ్గించేలా కేంద్రం చర్య ఉందని పవార్ మండిపడ్డారు.

గణాంకాలు, మెరిట్ ఆధారంగా గుజరాత్‌కు బదులు ముంబైలోనే ఐఎఫ్ఎస్‌సీ ఏర్పాటు పవర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని హేతుబద్ధంగా వ్యవహరించి, న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్టు పవార్ ఆ లేఖలో పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యతా అంశంగా దీన్ని తక్షణమే మోదీ పరిశీలించాలని స్పష్టం చేశారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version