https://oktelugu.com/

నారాయణ వర్సెస్‌ పువ్వాడ

సీపిఐ నేత నారాయణ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌‌ మధ్య గోడవ తారాస్థాయికి చేరింది. మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ ఆయన పదేపదే డిమాండ్ చేస్తుండడం, అజయ్‌ కూడా అదేస్థాయిలో రియాక్ట్ అవుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. Also Read: గ్రేటర్లో గెలుపొటములు డిసైడ్ చేసేది ‘మాస్’ ఓటర్లేనా? గ్రేటర్‌‌ ఎన్నికల్లో మొదలైన రచ్చ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కూకట్ పల్లి ఇన్‌చార్జిగా వ్యవహరించిన అజయ్.. పోలింగ్‌ రోజున అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 3, 2020 3:54 pm
    Follow us on

    CPI Narayana vs Puvvada Ajay Kumar
    సీపిఐ నేత నారాయణ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌‌ మధ్య గోడవ తారాస్థాయికి చేరింది. మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ ఆయన పదేపదే డిమాండ్ చేస్తుండడం, అజయ్‌ కూడా అదేస్థాయిలో రియాక్ట్ అవుతుండడం హాట్ టాపిక్‌గా మారింది.

    Also Read: గ్రేటర్లో గెలుపొటములు డిసైడ్ చేసేది ‘మాస్’ ఓటర్లేనా?

    గ్రేటర్‌‌ ఎన్నికల్లో మొదలైన రచ్చ

    గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కూకట్ పల్లి ఇన్‌చార్జిగా వ్యవహరించిన అజయ్.. పోలింగ్‌ రోజున అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు కారుపై దాడి చేయడంతో రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందిచించిన సీసీఐ నేత నారాయణ ఓ బాధ్యతయుతమైన మంత్రి పదవిలో ఉండి డబ్బులు పంపిణీ చేయడం ఏమిటని, వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

    మండిపడ్డ మంత్రి

    దాడి చేసిన బీజేపీ ఏమీ అనుకుండా తనను టార్గెట్‌ చేయడంతో మంత్రి అజయ్‌ తీవ్రంగా స్పందించారు. నారాయణ బీజేపీలో చేరారేమో అని విమర్శించారు. అక్కడేం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నారంటూ.. ఎద్దేవా చేశారు. తన తండ్రి నుంచి నారాయణ ఎంతో సాయం పొంది మోసం చేశారని, తాను నోరు తెరిస్తే నారాయణ బాగోతం మొత్తం బయట పడుతుందని హెచ్చరించారు. దీనిపై నారాయణ కూడా మళ్లీ స్పందించారు. అజయ్‌ను బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య గొడవ ఇప్పటిది కాదని, పాత గొడవలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

    Also Read: కవితకు మంత్రి పదవి ఖాయమే.!

    అజయ్‌ది కమ్యూనిస్టు బ్యాక్‌ గ్రౌండ్

    పువ్వాడ అజయ్ సీపీఐ ప్రముఖ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు. కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ ఆయన మొదట కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచే ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అక్కడ్నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచి మంత్రి పదవి పొందారు. గతంలో నారాయణ అజయ్‌ కుటుంబంతో బాగానే ఉండేవారని, ఎక్కడో తేడాలు రావడంతోనే ఇలా స్పందిస్తున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్