
హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అన్ని పార్టీల్లోనూ ప్రచార వేడిరాజుకుంది. అయితే గ్రేటర్ ఎన్నికలు మాత్రం కొందరు నేతలకు వరంగా మారినట్లు కన్పిస్తోంది.
Also Read: కేసీఆర్ వ్యూహం దెబ్బకొడుతోందా..?
అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ లోని కొందరు నేతలు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వీరిని సముదాయించాల్సిన పార్టీ పెద్దలు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈసమయంలో గ్రేటర్ ఎన్నికలు రావడంతో తిరిగి వారికి టైమ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తమను పార్టీలో పట్టించుకోని ముఖ్యనేతలు స్వయంగా వచ్చి వారిని బుజ్జగింపు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో గతంలో ఫేడ్ అవుట్ నేతలు సైతం ప్రస్తుతం లైమ్ లైట్లోకి వస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ చెందిన ముఖ్య నేతలను బీజేపీ తమ పార్టీలోకి పెద్దఎత్తున ఆహ్వానిస్తుంది. దీంతో ప్రధాన పార్టీలు ముఖ్య నేతలు చేజారకుండా బుజ్జగింపులు.. బంపరాఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రేటర్లోని అసంతృప్త నేతలకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్లు కన్పిస్తున్నాయి.
రెండేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ సస్పెండ్ అయ్యారు. ఆయన టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే బీజేపీ ముఖ్య నేతలు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఆయన ఉబ్బితబ్బిబై పార్టీలో చేరుతానని హామీ ఇచ్చారని సమాచారం. అదేవిధంగా టీఆర్ఎస్ లో ఇటీవల అసంతృప్త గళం విన్పిస్తున్న శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ ను బీజేపీలోకి ఆ పార్టీ ముఖ్యనేతలు ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది.
Also Read: పవన్ కళ్యాణ్ ట్రోల్స్ బారిన పడ్డాడా?
నిన్నటి వరకు సర్వే సత్యనారాయణ.. స్వామిగౌడ్ లను ఆ పార్టీ నేతలు కూడా పట్టించుకోలేదు. అయితే తాజాగా బీజేపీ ముఖ్య నేతలు బండి సంజయ్.. లక్ష్మణ్ లు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడంతో వారిద్దరు ఉబ్బితబ్బిబు అవుతున్నారు. ఈమేరకు పార్టీలో చేరుతామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వీరిద్దరు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన నేతలే కావడం విశేషం. అయితే కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న ఈ నేతలకు గ్రేటర్ ఎన్నికలు మళ్లీ మంచి రోజులను తీసుకొచ్చాయి. దీంతో వీరిద్దరు రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత కూడా వీరు యాక్టివ్ గా ఉంటారా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
Comments are closed.