Governor RN Ravi vs DMK: మనదేశంలో రాజకీయ నాయకులు మాత్రమే కాదు గవర్నర్లకు కూడా రాజకీయ వాసనలు ఉంటాయి. గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. రాష్ట్రాలలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తమకు నివేదికల ద్వారా తెలియజేయాలని సూచిస్తుంది. అయితే గవర్నర్లు కొన్ని సందర్భాలలో తమ పరిధులు దాటుతుంటారు. రాష్ట్రానికి ప్రధాన పౌరులం అనే విషయాన్ని మర్చిపోయి.. రాజకీయాలలో వేలు పెడుతుంటారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా చేయు దాటిపోతుంటాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్, తమిళ సై సౌందరరాజన్ మధ్య కొద్ది రోజులపాటు ఇటువంటి పరిణామాలు జరిగాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె పార్టీ అధికారంలో ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఆర్ఎన్ రవి గవర్నర్ గా కొనసాగుతున్నారు. రవి తమిళ భాషను వ్యతిరేకిస్తారని ఆ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా డీఎంకే కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. అంతేకాదు ఆయన సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ హిందీ లేదా ఇంగ్లీషులోనే ప్రసంగిస్తుంటారు. సహజంగానే మాతృభాష మీద విపరీతమైన ప్రేమ ఉండే తమిళులు గవర్నర్ వైఖరిని విపరీతంగా విమర్శిస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే గవర్నర్ రవిని ఏకిపారేస్తుంటారు. కొంతకాలంగా గవర్నర్, డీఎంకే ప్రభుత్వానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నీట్ కు వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం ఒక తీర్మానం చేసినప్పుడు.. దానిని గవర్నర్ వ్యతిరేకించారు. అప్పట్లో ఇది తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
Also Read: భారత్ ని ఆకాశానికెత్తిన S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ
తాజాగా ఆ రాష్ట్ర ప్రథమ పౌరుడికి ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో చేదు అనుభవం ఎదురయింది.. డీఎంకే నేత భార్య జీన్ జోసెఫ్ అత్యున్నత విద్యను పూర్తి చేశారు. గవర్నర్ నుంచి డిగ్రీ పట్టా తీసుకోవడానికి ఆమె నిరాకరించారు. వేదిక మీద ఉన్న ఆయనను పట్టించుకోకుండానే వెళ్లి.. వైస్ ఛాన్స్ లర్ చేతుల మీదుగా పట్టా తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డీఎంకే నేత భార్య వ్యవహరించిన తీరును బిజెపి నాయకులు తప్పు పడుతుండగా.. తమిళనాడు ఆత్మాభిమానాన్ని జీన్ జోసెఫ్ ప్రదర్శించారని డిఎంకె కార్యకర్తలు అంటున్నారు.. ఆమెను తమిళ విప్లవ నాయకిగా అభివర్ణిస్తున్నారు.
తమిళనాడులో భాష రాజకీయాలు ఇదే తొలిసారి కాదు. కానీ ఇప్పుడు అవి తారస్థాయికి చేరిపోయాయి. అధికార డిఎంకె కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తోంది. గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు ఇలా చేయడం వల్లే ఉద్యమాలు వచ్చాయని.. ఇప్పుడు కేంద్రం కూడా అదే ధోరణి కొనసాగిస్తున్న నేపథ్యంలో.. అనివార్యంగా ఉద్యమాలు మొదలవుతున్నాయని డీఎంకే నేతలు చెబుతున్నారు. మరోవైపు హిందీని తాము బలవంతంగా రుద్దడం లేదని, లేనిపోని గొడవలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని డీఎంకే నేతలు భావిస్తున్నారని బిజెపి నాయకులు చెబుతున్నారు.
Ph.D. scholar Jean Joseph refused to receive her degree from Tamil Nadu Governor R.N. Ravi during the convocation simply because he isn’t “friendly” enough with CM Stalin.
This is a shameful display of arrogance and political intolerance. Education teaches dignity, not petty… pic.twitter.com/DgF426aED1
— Mr Sinha (@MrSinha_) August 13, 2025