Actor Qualities for God role: నితిష్ తివారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’ (Ramayanam)… ఇండియాలో అత్యంత పవిత్ర గ్రంథం గా భావించే రామాయణాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్ నటిస్తున్నాడు. అయితే రన్బీర్ కపూర్ ఈ సినిమాలో నటించడం పట్ల ఉదయ్ మహుర్కర్ అనే ఒక వ్యక్తి రాముడి పాత్రను చేయడానికి పనికిరాడు అంటూ సమాచార ప్రసార శాఖల మంత్రి అయిన ఆశ్విన్ వైష్ణవ్ కి ఒక లేక రాశాడు… ఆయన రాసిన లేఖలో 2023వ సంవత్సరంలో రన్బీర్ కపూర్ అనిమల్ అనే ఒక సినిమా చేశాడు. అందులో ఆయన ప్రవర్తించిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆడవాళ్ళతో ఆయన అనుసరించిన విధానం చూడడానికి అసభ్యంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి రాముడిగా చూపించే ప్రయత్నం చేస్తే మేము ఎలా ఊరుకుంటాం అంటూ ఆయన ఆ లేఖలో తెలియజేశాడు…మరి ఏది ఏమైనా కూడా ఆయన రాసిన వాదనను తెలుసుకున్న చాలామంది స్పందిస్తూ నటుడు అంటే అన్ని రకాల పాత్రలను పోషిస్తాడు అది వాళ్ళ వృత్తిలో భాగమే తప్ప పర్సనల్గా ఎవరు తీసుకోకూడదు అంటూ అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేశారు.
అయినప్పటికీ ఆయన మాత్రం నిజాయితీకి నిలువెత్తు రూపంగా కొలుచుకునే మా రాముడి పాత్రను ఎవ్వరు పడితే వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఈ సినిమా నుంచి అతన్ని తప్పించి వేరే వాళ్లను తీసుకోండి అంటూ అప్పట్లో ఆయన రాసిన లెటర్ సంచలనాన్ని సృష్టించింది. మరి ఏది ఏమైనా కూడా నటుడు ఏది చేసిన కూడా దానిని పర్సనల్ గా తీసుకోకూడదు.
Also Read: కూలీ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..పుష్ప 2 రికార్డ్స్ కూడా ఎగిరిపోయాయిగా!
కేవలం అతని నటనని మాత్రమే చూడాలని ఎంతమంది ఎన్ని సమాధానాలు చెప్పినా కూడా ఆయన మాత్రం తన మొండి వైఖరిని మార్చుకోలేకపోయాడు. మరి ఏది ఏమైనా ఇప్పుడు రామాయణం సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏమి చేసే అవకాశం లేకుండా పోయింది.
ఇక ఇదే సంఘటనకి అరుణ్ గోవిల్ ని ఉదాహరణగా చూపిస్తూ 1987లో ఆయన కూడా రాముడిగా నటించాడు. ఆ తర్వాత ఆయన ఎన్నో అభ్యంతరకరమైన ఇబ్బందిని కలిగించే పాత్రలో నటించాడు. అయినప్పటికీ అతన్ని ఎవరూ ఏమీ అనడం లేదు. అసలు అతని గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. మరి రన్బీర్ కపూర్ మీదే ఇలాంటి కామెంట్లు ఎందుకు చేస్తున్నారు అంటూ మరి కొంతమంది వాళ్ళ వాదనను తెలియజేస్తూ ఉండడం విశేషం…