War 2 Jr NTR Role: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగిన ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి మార్కెట్ క్రియేట్ అవుతోంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. నిజానికి ఎన్టీఆర్ ఒక సినిమాకి కమిట్ అయితే ఆ సినిమాకి ఎలాంటి మెకోవర్ కావాలో తనను తాను అలా మార్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఒక సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ఆ సినిమా సక్సెస్ లో తను కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే హృతిక్ రోషన్ తో కలిసి చేసిన వార్ 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ విపరీతంగా కష్టపడ్డారట. తన బాడీని ఆ లుక్కులోకి మార్చుకోవడానికి మెకోవర్ ను సంపాదించుకోవడానికి తీవ్రంగా కసరత్తులు చేయడమే కాకుండా కొన్ని సన్నివేశాల్లో తను డూపు లేకుండా నటించి చాలా రిస్కీ షాట్స్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 సినిమా ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి ఎన్టీఆర్ పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం… ఇక బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.
Also Read: కూలీ మూవీ ని మిస్ చేసుకొని ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న నటులు…
మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ అయితే కాదని చాలా మంది విమర్శకులు వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఎన్టీఆర్ ఇక మొదట చేయబోయే సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
అయితే జూనియర్ ఎన్టీఆర్ మొదట ఈ సినిమా స్టోరీ విని తను చేయనని చెప్పాడట. కానీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ తో మాట్లాడి తన పాత్రలో మరికొన్ని మార్పులు చేర్పులు చేస్తానని చెప్పారట. అందువల్లే ఎన్టీఆర్ ఈ సినిమాకి ఒప్పుకున్నాడు. కానీ ఫైనల్ గా మాత్రం ఆ మార్పులు చేర్పులు చేయలేదని దర్శకుడు తనని మోసం చేశారంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు కొన్ని వార్తలైతే స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ మాత్రం ఈ విషయం మీద ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. కానీ తన అభిమానులు మాత్రం బాలీవుడ్ దర్శకులను నమ్మకూడదు.
Also Read: కూలీ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..పుష్ప 2 రికార్డ్స్ కూడా ఎగిరిపోయాయిగా!
ఇంతకుముందు కూడా కొంత మంది హీరోలను అలాగే చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకి భారీ ఎలివేషన్స్ ఉంటాయని చెప్పి అతనిచేత విలన్ గా నటింపజేసి అలాంటివేమీ లేకుండా చేశారని కొన్ని కామెంట్లు అయితే వెలువడుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…