Governor Invites KCR: కేసీఆర్ఆర్ అంటే ఒకప్పుడు రాజకీయ చాణక్యుడిగా వెలుగొందేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాలం మారితే మనుషులు మారతారన్నట్టు కేసీఆర్ కూడా మారిపోయారు. ఎంతలా అంటే తనకు తానే ఆత్మరక్షణలో పడిపోయేంత. ఒకప్పుడు పర్ ఫెక్ట్ నిర్ణయాలు తీసుకునే గులాబీ బాస్.. ఇప్పుడు మాత్రం అయోమయంలో పడిపోతున్నారు.
ఇలాంటి అయోమయంలోనే ఎవరిని దగ్గర చేసుకోవాలో.. ఎవరిని దూరం పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ఫలితంగా ఈ రాజకీయ చాణక్యుడు అటు కేంద్రంతో పెద్ద సమరమే సాగిస్తున్నారు. మొన్నటి వరకు గురువుగా ఉన్న చిన్న జీయర్ ను కూడా దూరం చేసుకున్నారు. ఇవి సరిపోవన్నట్టు చివరకు గవర్నర్ తమిళ్ సై తో కూడా విభేదాలు వచ్చాయి. దాంతో ఆమెను టీఆర్ఎస్ ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. ఆమె హాజరయ్యే కార్యక్రమాలకు సీఎం అస్సలు వెళ్లట్లేదు.
వాస్తవానికి ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య సత్సంబంధాలు ఉండటం చాలా ముఖ్యం. సీఎంకు గవర్నర్ కు ఎంత మంచి సన్నిహిత్యం ఉంటే అంత బాగా అనుకున్న పనులు జరుగుతాయి. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ ఎంతో సన్నిహితంగా ఉండి తాను అనుకున్న పనులు అన్నీ చేయించుకున్నారు. పథకాల దగ్గర నుంచి మొదలుపెడితే.. ముందస్తు ఎన్నికల వరకు అటు కేంద్రంతో ఇటు గవర్నర్ తో సత్సంబంధాలు మెయింటెన్ చేసి రెండోసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు.
Also Read: Kangana Ranaut Crazy Comments on Rajamouli: రాజమౌళి పై వివాదాల రాణి క్రేజీ కామెంట్స్
కానీ ఇప్పుడు మాత్రం ఒకే సారి అటు కేంద్రంతో ఇటు గవర్నర్ తో వైరం పెట్టుకుని ఇరకాటంలో పడిపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ సాయంతో ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్న కేసీఆర్.. గవర్నర్ తో ఎంత సన్నిహితంగా ఉంటే అంత బెటర్. ఈ క్రమంలోనే ఇప్పుడు కేసీఆర్ కు ఓ మంచి అవకాశం వచ్చింది. స్వయంగా గవర్నర్ ఓ మెట్టు దిగి మరీ.. కేసీఆర్ ను ఉగాది వేడుకలకు ఆహ్వానించింది. ఒకటో తేదీన రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ వేడుకలకు హాజరు కావాలంటూ కేసీఆర్‌కు ఆహ్వానం పంపింది తమిళిసై.
వాస్తవంగా గవర్నర్ ఎలాంటి విభేదాలు పెట్టుకోవాలని అనుకోవట్లేదు. అందుకే ఆమెనే ఓ మెట్టు దిగి మరీ వచ్చింది. మరి ఈ అవకాశాన్ని కేసీఆర్ వినియోగించుకుంటారా అనే చర్చ మొదలైంది. ఒకవేళ కేసీఆర్ ఈ అవకాశాన్ని వాడుకుని గవర్నర్ కు మళ్లీ దగ్గరైతే గనక.. రానున్న రోజుల్లో కేసీఆర్ కు ఏదో ఒక రకంగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. మరి ఆయన ఏం చేస్తారో వేచి చూడాలి.
Also Read: Junior NTR Politics: మరో పదేళ్లు.. చంద్రబాబు వయసు అయిపోయాకే రాజకీయాల్లోకి ఎన్టీఆర్?