https://oktelugu.com/

Ashoka Vanam lo Arjuna Kalyanam: అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం.. పాట వచ్చేసింది

Ashoka Vanam lo Arjuna Kalyanam: యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటేస్ట్ చిత్రం అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం. కాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్‌ లో పడే పాట్లు.. ఇలా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 1, 2022 / 03:40 PM IST

    Ashoka Vanam lo Arjuna Kalyanam

    Follow us on

    Ashoka Vanam lo Arjuna Kalyanam: యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటేస్ట్ చిత్రం అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం. కాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్‌ లో పడే పాట్లు.. ఇలా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

    Ashoka Vanam lo Arjuna Kalyanam

    ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది. అయితే, ఈ సినిమాను ఏప్రిల్ 22న‌ విడుద‌ల చేస్తున్నారు. ఐతే ఈ సినిమా నుంచి ‘రామ్ చిలక..’ అనే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. లిరిక్స్ బాగున్నాయి.

    ‘‘ఉరికే నా సిల‌కా నీ స‌క్క‌నైన పాట మెళిక‌
    గ‌ట్టు దాటి పుట్ట దాటి.. ఏడేడు ఏర్లు దాటి
    కొండా దాటి కోన దాటి .. కోసు కోసు దార్లు దాటి
    సీమా సింత నీడ‌కొచ్చానె రంగు రంగు రామ్ చిల‌క సింగ‌రాల సోకులు చూశానె’’

    అని అల్లం అర్జున్ కుమార్ తనకు కాబోయే భార్య గురించి పాట పాడుకుంటున్న సందర్భంలో ఈ పాట రానుంది. ఇంతకీ అల్లం అర్జున్ కుమార్ ఎవ‌రు? ఇతని బాధేంటి? అనే విష‌యం తెలియాలంటే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా చూడాల్సిందే. సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

    Ashoka Vanam lo Arjuna Kalyanam

    ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం కాబట్టి.. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా పైనే తన హోప్స్ అన్నీ పెట్టుకున్నాడు విశ్వక్‌ సేన్‌. మరి విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాతో హిట్ కొడతాడా ? సినిమాలో మ్యాటర్ మాత్రం చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది.

    ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    Tags