Andhra Prades: ఏపీలో పాలన తీరు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. మనకు గతంలో ఒక సామెత ఉండేది.. యథా రాజా తథా ప్రజా అని. కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే యథా జగన్ తథా ఐఏఎస్ అన్నట్టుంది. అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఏపీలోని చాలా మంది ఐఏఎస్ లు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది అయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక పాలనను సాగిస్తున్నారు.
జగన్ ఏ విధంగా అయితే కోర్టులను పట్టించుకోరో.. ఎలాగైతే తే కోర్టు తీర్పును లెక్కచేయకుండా తాను అనుకున్న పని చేసుకుంటూ పోతారో.. అలాగే ఐఏఎస్ లు కూడా చేస్తున్నారు. ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పనిచేస్తున్న ఐఏఎస్ ల పనితీరు ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి ఒక్క ఏపీ లోనే ఐఏఎస్ లు ఎందుకు ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.. అంటే రాజు ఒక దారిలో నడిస్తే సేన మరోదారిలో నడుస్తుందా. కానీ ఐఏఎస్ లు అంటే స్వయం ప్రతిపత్తిగల అధికారులు.
Also Read: Pushp Box Office Collection: ‘పుష్ప’ రికార్డుల వేట మాత్రం ఆపడం లేదు
రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. అంతేగానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తే వారే చిక్కుల్లో పడతారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలో చేస్తున్న పని ఇదే. అధికారులను నయానో భయానో తమ గుప్పిట్లో పెట్టుకుంది. జగన్ సీఎం అయినప్పటి నుంచి తనకు కావాల్సిన వారిని స్వరాష్ట్రంకు ట్రాన్స్ ఫర్ చేయించుకుని.. వారితో తాను అనుకున్న పాలనను సాగిస్తున్నాడు.
కానీ జగన్ సాగిస్తున్న పాలనకు.. చివరకు ఐఏఎస్ అధికారులు బలైపోతున్నారు. హై కోర్టు ఆవరణలో ఐఏఎస్ అధికారులు కనిపించని రోజే లేదు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘన పాలన సాగుతుందో చెప్పొచ్చు. మరి దీనికి అంతిమంగా కారణం ఎవరు.. బలైపోతుంది ఎవరు.. ఈ విషయాన్ని అధికారులు క్లుప్తంగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఐదేళ్లకోసారి మారుతుంది.
ప్రభుత్వ ప్రతినిధుల ఒత్తిడికో లేక భయానికో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవు. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఐఎఎస్ అధికారులు ఉన్నారు కదా.. మరి వారు ఎందుకు ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం లేదు. కాబట్టి ఈ విషయాలను ఐఏఎస్ ఆఫీసర్ లు ఆలోచించుకొని ప్రజలకు అనుగుణంగా పని చేస్తే బెటర్.
Also Read: Roja Amabati: ఫైర్ బ్రాండ్స్ రోజా, అంబటికి జగన్ ఎందుకు మంత్రి పదవులు ఇవ్వడం లేదు?