మరోసారి తెరపైకి మూడు రాజధానుల అంశం..!

అసెంబ్లీ సమావేశాల చోటు చేసుకున్న పరిణామాలతో రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన రావడంతో రాజధాని ప్రాంతంలో అలజడి నెలకొంది. పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధికి మంత్రమని, మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే మా […]

Written By: Neelambaram, Updated On : June 16, 2020 2:29 pm
Follow us on


అసెంబ్లీ సమావేశాల చోటు చేసుకున్న పరిణామాలతో రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన రావడంతో రాజధాని ప్రాంతంలో అలజడి నెలకొంది. పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధికి మంత్రమని, మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే మా ఉద్దేశం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు.

గత అసెంబ్లీ సమావేశాలలో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. శాసన సభలో బిల్లులు ఆమోదం పొందగా, శాసన మండలిలో బిల్లులు ఆమోదానికి నోచుకోలేదు. శాసన సభ ఛైర్మన్ బిల్లులలో అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయని భావించి సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. మండలి కార్యదర్శి తదుపరి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రక్రియ అలాగే నిలిచిపోయింది.

మరోవైపు బిల్లులను ఆమోదింప జేసుకునేందుకు ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. కొన్ని సవరణలతో మరోసారి బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. బిల్లులు ఆమోదం పొందిన అనంతరంమే రాజధానిని తరలిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై సర్కారు దృష్టి సారించింది.

ఇదిలా ఉండగా మరోవైపు ప్రభుత్వ ఉన్నత అధికారులు కార్యనిర్వహక రాజధానిగా నిర్ణయించిన విశాఖ నగరంలో సీఎంఓ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం భూములను పరిశీలించారు. సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, నిపుణులతో కలిసి కొద్దీ రోజుల కిందట సాగర తీరంలోని భూములను సందర్శించారు. అధికారులు కార్యనిర్వాహక రాజధాని కోసం వారి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు.

గవర్నర్ ప్రసంగంలో లేవనెత్తిన అంశాలతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టమవుతోంది. రాజధాని రైతులు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించినా ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. టీడీపీ న్యాయపరంగానే ఈ అంశాన్ని ఎదుర్కోవాలని భావిస్తుంది. శాసన మండలి కార్యదర్శి ఛైర్మన్ ఆదేశాలను అమలు చేయడం లేదని, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపక పోవడంపై ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.