https://oktelugu.com/

మార్చురీ బాక్స్ లో మద్యం తరలింపు..!

మద్యం అక్రమ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులకు దొరకకుండా అక్రమంగా మద్యం తెచ్చి విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. మార్చురీ బాక్స్ లో అక్రమ మద్యం తరలిస్తున్న సంఘటన కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… తెలంగాణ నుండి ఆంధ్రా ప్రాంతానికి అంబులెన్స్ లో మార్చూరీ బాక్స్ ఉంచి మద్యం తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ ను ఆపి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 16, 2020 / 02:19 PM IST
    Follow us on


    మద్యం అక్రమ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులకు దొరకకుండా అక్రమంగా మద్యం తెచ్చి విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. మార్చురీ బాక్స్ లో అక్రమ మద్యం తరలిస్తున్న సంఘటన కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది.

    వివరాల్లోకి వెళితే… తెలంగాణ నుండి ఆంధ్రా ప్రాంతానికి అంబులెన్స్ లో మార్చూరీ బాక్స్ ఉంచి మద్యం తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ ను ఆపి తనిఖీ చేయడంతో మద్యం సీసాలు దొరికాయి. మొత్తం 107 లీటర్ల మద్యం సీసాలు వీరులపాడు పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం స్వాధీనం చేసుకున్నారు.

    వీరులపాడు మండలం పెద్దాపురం చెక్ పోస్ట్ వద్ద వెనక ఎస్కార్ట్ గా వస్తున్న ఒక కారుతో సహా అంబులెన్స్ ను పట్టుకొని అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎదో ఒక మార్గంలో మద్యం అక్రమ రవాణాకు వ్యాపారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కాపు సారా తయారీ ముమ్మరంగా సాగుతుంది.