Telugu News » India » Good news validity of driving licences vehicle registration
వాహన యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్
దేశంలో కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజులపాటు లాక్డౌన్ అమలుతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్యం అన్ని బంద్ అవడంతో ప్రతీఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ కారణంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ చేయించుకోవడంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ ఇతర రవాణా పత్రాల కాలపరిమితిని జూన్ 30 వరకూ కేంద్రం పొడిగిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కేంద్ర రవాణా […]
దేశంలో కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజులపాటు లాక్డౌన్ అమలుతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్యం అన్ని బంద్ అవడంతో ప్రతీఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ కారణంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ చేయించుకోవడంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ ఇతర రవాణా పత్రాల కాలపరిమితిని జూన్ 30 వరకూ కేంద్రం పొడిగిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహనదారులు సంబంధిత పత్రాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని పలువురు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 1, 2020నాటికి గడువు ముగిసిన పత్రాలను జూన్ 30, 2020వరకు చెల్లుబాటయ్యేలా చూడాలని కేంద్రం ఈమేరకు ఎన్ ఫోర్స్ మెంట్ శాఖకు సూచించింది. ఇందుకు సంబంధించి ఆన్ లైన్లో ఎన్ఐసీ ఇస్తుంది. కేంద్రం నిర్ణయం వల్ల 23కోట్ల మంది వాహన యజమానులు, 1.2కోట్ల వాహనాలకు ఊరట లభించనుందని సమాచారం.