మారువేషంలో జేసీ.. అవాక్కైన వ్యాపారులు

సినిమాల్లోనే ఇప్పటి వరకూ మోసాలను వెలుగులోకి తెచ్చేందుకు అధికారులు మారు వేషం వెయ్యడాన్ని చూశాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి అధికారులు కనిపిస్తున్నారు. విజయనగరానికి చెందిన జాయింట్ కలెక్టర్.. మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు. జిల్లాలో లాక్‌డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువులు, కొరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావటంతో.. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్.. దీనిపై దృష్టి సారించారు. మంగళవారం ఉదయం జిల్లా […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 8:17 pm
Follow us on

సినిమాల్లోనే ఇప్పటి వరకూ మోసాలను వెలుగులోకి తెచ్చేందుకు అధికారులు మారు వేషం వెయ్యడాన్ని చూశాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి అధికారులు కనిపిస్తున్నారు. విజయనగరానికి చెందిన జాయింట్ కలెక్టర్.. మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు. జిల్లాలో లాక్‌డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువులు, కొరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావటంతో.. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్.. దీనిపై దృష్టి సారించారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. ఇతర కొనుగోలు దారుల నుంచి ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల రూ.5 ఎక్కువ అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఎక్కడ తప్పు జరుగుతోందో అధికారులతో సమావేశమై ధరలు నియంత్రణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మారువేషంలో వచ్చింది జాయింట్ కలెక్టర్ అని తెలుసుకొని కొంత మంది వ్యాపారులు అవాక్కయ్యారు.