దేశంలోనూ కరోనా(కోవిడ్-19) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజు దేశంలో 227కేసులు పాజిటివ్ కేసులు నమోదవడంతో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం మరింత కఠిన నిర్ణయాలు చేసేందుకు సిద్ధమవుతుంది.
దేశంలో ఇప్పటికే 1,410కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా 40మంది మృత్యువాత పడ్డారు. కేవలం 24గంటల వ్యవధిలోనే దేశంలో 227కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు కావడం గమనార్హం. దేశంలో కరోనాను నిర్ధారించడానికి 123పరీక్షా కేంద్రాలు పని చేస్తున్నాయని ఇప్పటివరకు 40వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాను నియంత్రించడానికి ఎయిమ్స్ వైద్య బృందం తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది.
ముందు జాగ్రత్తగా 15వేల మంది నర్సులకు ఆన్ లైన్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. కరోనా నివారణకు అవసరమైన అన్ని పరిరకాలను దక్షిణ కొరియా, వియత్నాం, టర్కీ నుంచి తెప్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలు కూడా కరోనా నివారణకు సహకారం అందించడంపై కేంద్రం ప్రశంసించింది. ఇప్పటివరకు తెలంగాణలో 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదుగా ఆరుగురు మృతిచెందారు. ఏపీలో 40కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలు కట్టడికి శాయశక్తుల కృషి చేస్తున్న కరోనా కేసులు పెరగకుండా నిరోధించలేకపోతున్నారు. మున్మందు కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆందోళనలు నెలకొన్నాయి.