Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson gesture after India win: టీమ్ ఇండియా గెలిచిన తర్వాత.. సంజు శాంసన్...

Sanju Samson gesture after India win: టీమ్ ఇండియా గెలిచిన తర్వాత.. సంజు శాంసన్ చేసిన పనికి అందరూ ఫిదా!

Sanju Samson gesture after India win: కోల్ కతా వేదికగా ఆదివారం వెస్టిండీస్ జట్టుతో జరిగిన టి20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారకుడు సంజు శాంసన్. ఓపెనర్ గా వచ్చిన అతడు ఈ మ్యాచ్ లో ఏకంగా 97* పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ వంటి వారు విఫలమైనప్పటికీ.. సంజు జట్టు కోసం నిలబడ్డాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి సంచలనం సృష్టించాడు.

ఈ మ్యాచ్ లో సంజు స్థిరంగా ఆడాడు. ప్రారంభం నుంచి చివరి వరకు తన వికెట్ ను అంటి పెట్టుకొని ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో వీర విహారం చేశాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ.. అంతే వేగంతో మిగతా పరుగులు చేశాడు. తద్వారా తను ఎంత విలువైన ఆటగాడినో మరోసారి నిరూపించాడు. చివరి ఓవర్ లో రుమారియో షెఫర్డ్ బౌలింగ్లో తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని ఫోర్ కొట్టాడు. చివరికి టీమిండియా కు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టాడు. టీమిండియా విజయం సాధించిన తర్వాత.. మైదానంలో చేతికి గ్లవ్స్ తీసి.. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. తను ఎంతగానో ఆరాధించే జీసస్.. ఇష్టపడే రాముడిని.. ప్రేమించే అల్లాను ఏకకాలంలో స్మరించుకున్నాడు. తద్వారా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు.

Also Read: ఓరేయ్ ’పాకీ అమీరూ‘.. ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్ రా..

మహిళా వన్డే వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో సెమి ఫైనల్ మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన సెంచరీ వెనుక జీసస్ ఉన్నాడని జెమీమా వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపాయి. ఆ విషయం సంజు కు తెలుసు కాబట్టి.. తను కూడా క్రిస్టియన్ భక్తుడు కాబట్టి.. అటువంటి వివాదానికి తావు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అందరి దేవుళ్లను ఏకకాలంలో స్మరించుకొని.. విమర్శకుల నోళ్లు మూయించాడు.

సంజు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక వర్గానికి మాత్రమే తాను ప్రతినిధిని కాదని.. తాను అందరు మెచ్చే ఆటగాడినని సంజు నిరూపించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సంజు ఆటతోనే కాకుండా.. గొప్ప ప్రవర్తనతో కూడా అందరి మనసులు గెలుచుకున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version