Karnataka: గొర్రెకు రూ.2 లక్షల ధరనా?

Karnataka:  మన దేశంలో మాంసానికున్న డిమాండ్ ఎక్కువే. ప్రతి వారు మాంసారం తీసుకుంటూనే ఉన్నారు. దీంతో మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కిలో మాంసం ధర సుమారు రూ.700లు గా ఉంది. ఇది పండుగ సమయాల్లో ఇంకా ఎక్కువగా వెయ్యి రూపాయల వరకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మాంసాహారం అంటే అందరికి మక్కువే. దీంతో మాంసాహారం కోసం జంతువులను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మనకు గొర్రెలు, మేకలు, కోళ్ల నుంచి మాంసాహారం వస్తుంది. వాటిని ఇంటి వద్దే […]

Written By: Srinivas, Updated On : November 15, 2021 12:29 pm
Follow us on

Karnataka:  మన దేశంలో మాంసానికున్న డిమాండ్ ఎక్కువే. ప్రతి వారు మాంసారం తీసుకుంటూనే ఉన్నారు. దీంతో మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం కిలో మాంసం ధర సుమారు రూ.700లు గా ఉంది. ఇది పండుగ సమయాల్లో ఇంకా ఎక్కువగా వెయ్యి రూపాయల వరకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మాంసాహారం అంటే అందరికి మక్కువే. దీంతో మాంసాహారం కోసం జంతువులను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మనకు గొర్రెలు, మేకలు, కోళ్ల నుంచి మాంసాహారం వస్తుంది. వాటిని ఇంటి వద్దే పెంచుకుంటూ వాటి అమ్మకంతో ఆదాయం సంపాదిస్తుంటారు.

అయితే సాధారణంగా ఒక గొర్రెకు రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు ధర ఉంటుంది. కానీ ఇక్కడ ఓ గొర్రె ధర ఏకంగా రూ. రెండు లక్షలు పలికి రికార్డు సృష్టించింది. మరి దాని ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే అదీ లేదు. మామూలు గొర్రే. కానీ దానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సదరు యజమాని దాని ధర అమాంతం పెంచేశాడు. దీంతో ఎలాగైనా కొనాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి దాన్ని కొనుగోలు చేశాడు. ఊరేగింపుగా తన ఇంటికి తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ర్టంలోని మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప అనే వ్యక్తి ఈ గొర్రెను పెంచాడు. రెండే ళ్ల క్రితం దాన్ని లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. దీంతో దాని ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.2 లక్షలు పలికింది. గొర్రెల సంతానోత్పత్తికి ఇదే ప్రధానంగా మారిందట. దీంతో దాని ధర రెండేళ్ల నుంచి పెరుగుతూ వస్తోందట.

Also Read: Amit Shah: అమిత్ షా సైతం డ్రగ్స్ పై పడ్డాడే.. షాక్ జగన్ కా? ఉద్దవ్ ఠాక్రేకా?

కానీ గొర్రెకు అంత భారీ మొత్తంలో ధర పలకడం ఓ వింతే. దాన్ని కోసి మాంసం తిన్నా దాని ధర దానికే ప్రత్యేకతగా మారింది. అన్ని డబ్బులు పోసి కొనుక్కోవడంలో అతడికి ఏ లాభం ఉందో అని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి గొర్రెకు ఇంత భారీ మొత్తంలో ధర పలకడం సంచలనం సృష్టిస్తోంది.

Also Read: Congress Politics: అక్కడా అదే సీన్.. టార్గెట్ రేవంత్ రెడ్డి..?

Tags