Retail Inflation: ధరల పెరుగుదల.. సామాన్యుడి విలవిల

Retail Inflation: ధరల భారం ప్రజలను వెంటాడుతూనే ఉంది. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. ఇప్పటికే పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు మోత పెడుతున్న తరుణంలో మరోమారు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగేందుకు సిద్ధంగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ధరలు పెరుగుతూ సామాన్యుడిని అతలాకుతలం చేస్తున్నాయి. కిరాణ సరుకులు, ఎలక్రానిక్ వస్తువులు, బట్టలు తదితర వస్తువుల […]

Written By: Srinivas, Updated On : November 15, 2021 12:29 pm
Follow us on

Retail Inflation: ధరల భారం ప్రజలను వెంటాడుతూనే ఉంది. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. ఇప్పటికే పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు మోత పెడుతున్న తరుణంలో మరోమారు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగేందుకు సిద్ధంగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ధరలు పెరుగుతూ సామాన్యుడిని అతలాకుతలం చేస్తున్నాయి.


కిరాణ సరుకులు, ఎలక్రానిక్ వస్తువులు, బట్టలు తదితర వస్తువుల ధరలు పెరగుతాయని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో సామాన్య మానవుడి పరిస్థితి ఏంటనేది తెలియడం లేదు. రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు 8 నుంచి 10 శాతం మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా బతికేదని సగటు మనిషి తపన పడుతున్నాడు. ఇలా ధరలు పెరిగితే ఇక పొదుపు ఎలా చేసేదని ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వాలకు చిత్తశుద్ది కొరవడి ప్రజలపై భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పడిపోతోంది. దీంతోనే ధరల పెరుగుదల బాంబు ప్రజల నెత్తిన పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ధరల పెరుగుదలకు ఆస్కారం ఏర్పడుతోందని తెలుస్తోంది. ఇప్పటికే పెరిగిన కూరగాయల ధరలతో సతమతమవుతున్న జనానికి ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే కుటుంబ నిర్వహణ కత్తిమీద సామే అవుతుంది. దీనిపై ప్రభుత్వాలు ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది.

Also Read: రైతులకు తీపికబురు.. నెలకు సులువుగా రూ.3,000 పెన్షన్ పొందే ఛాన్స్?

రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిపై కూడా 5 నుంచి 6 శాతం ధరలు పెంచే అవకాశాన్ని సదరు సంస్థలు పరిశీలిస్తున్నాయని తెలుస్తోంది. ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే ఇక బతుకు సమరంలో సామాన్యుడి స్థానం ఏంటో అర్థం కావడం లేదు. ఏ వస్తువు కొనాలన్నా చేయి కాల్చుకోవాల్సిందే అని ఇప్పటికే తలలు పట్టుకున్న జనం ధరలు పెరిగితే :ఏం చేయాలని పలువురు ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Amit Shah: అమిత్ షా సైతం డ్రగ్స్ పై పడ్డాడే.. షాక్ జగన్ కా? ఉద్దవ్ ఠాక్రేకా?

Tags