Ravi teja: మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. క్రాక్‌తో సూపర్ హిట్‌కొట్టిన ఈ హీరో.. ప్రసస్తుతం మూడు, నాలుగు ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. కాగా, రవితేజ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కామెడి అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందని ఇటీవలే వార్తలు వినిపించాయి. ఆ సాంగ్‌లో అనసూయ నటిస్తుందని కూడా రామర్స్ వచ్చాయి.
అయితే, ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో ఈషా రెబ్బా కనిపించనుందంటూ సమాచారం. మొదట పాయల్, అనసూయ పేర్లు ఈ సాంగ్ కోసం అనుకోగా.. ఇప్పుడు ఇషా రెబ్బా పేరు వినిపించడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. గతంలో ఎప్పుడూ ఈషా స్పెషల్ సాంగ్స్‌లో చేయలేదు. మరి ఈ సినిమాలో నటిస్తుందా లేదా తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
చిన్న సినిమాలతో మంచి కమర్షియల్ హిట్ కొట్టే డైరెక్టర్‌గా దర్శకుడు త్రినాథరావుకు మంచి పేరు ఉంది. అందుకే ఈ సినిమాలో మంచి కామెడీ ఉన్న కంటెంట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ, టైగర్ నాగేశ్వరరావు, రావనాసుర, ఢమాకా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుని.. ఫుల్ షెడ్యూల్‌తో బిజీగా మారారు రవితేజ. మరి విభిన్న కథలను ఎంచుకోవడంలో ముందుడే మాస్ మహారాజ.. ఈ సినిమాల్లో ఎలా కనిపించనున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.