https://oktelugu.com/

మాస్కు పెట్టుకోలేదని మేకను అరెస్టు చేసిన పోలీసులు..!

ప్రస్తుతం మనమంతా కరోనా కాలంలో జీవిస్తున్నామని చెప్పుకోక తప్పదు. కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. మానవ నాగరికతకు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం ఎలాగో.. ఇప్పుడు సేమ్ టూ సేమ్ కరోనాకు ముందు(Before Carona).. కరోనా తర్వాత(After Carona) అనే పరిస్థితులు వచ్చాయి. Also Read: మళ్లీ లాక్ డౌన్ దిశగా మోడీ.. రేపు కీలక నిర్ణయం? 2020 సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా మహమ్మరి మానవళిపై తన ప్రభావాన్ని చూపుతోంది. చైనాలోని వూహాన్లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 05:21 PM IST
    Follow us on


    ప్రస్తుతం మనమంతా కరోనా కాలంలో జీవిస్తున్నామని చెప్పుకోక తప్పదు. కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. మానవ నాగరికతకు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం ఎలాగో.. ఇప్పుడు సేమ్ టూ సేమ్ కరోనాకు ముందు(Before Carona).. కరోనా తర్వాత(After Carona) అనే పరిస్థితులు వచ్చాయి.

    Also Read: మళ్లీ లాక్ డౌన్ దిశగా మోడీ.. రేపు కీలక నిర్ణయం?

    2020 సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా మహమ్మరి మానవళిపై తన ప్రభావాన్ని చూపుతోంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. చైనాలో కరోనా కట్టడి అయినప్పటికీ చైనాయేతర దేశాల్లో మాత్రం కోవిడ్-19 విజృంభిస్తుందటం ఆందోళన కలిగింది. అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతున్నాయి. పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.

    ప్రభుత్వాలు సైతం ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో ప్రతీఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్కులు ధరించడం.. శానిటైజర్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం.. భౌతికదూరం పాటిస్తున్నారు. మరోవైపు మాస్కులు ధరించని వారిపై ప్రభుత్వం, పోలీసులు కోరఢా ఝుళిపిస్తున్నారు. జరిమానాలు.. జైలు శిక్ష పేరుతో అలాంటి వారిలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మాస్కు ధరించలేదని ఒక మేకను పోలీసులు అరెస్టు చేయడం ఆసక్తికరంగానూ.. చర్చనీయంగానూ మారింది.

    Also Read: గ్రౌండ్ లెవల్లో జీరో.. సోషల్ మీడియాలో హీరో..

    ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాన్పూర్ లోని స్థానిక బెంకోగంజ్ ఏరియాలో ఒక మేక రోడ్డుపై అరుస్తూ అటూఇటూ తిరుగుతోంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసుల కంటికి ఈ మేక కన్పించింది. కరోనా నిబంధనల ప్రకారం మేక మాస్కు ధరించకపోవడంతో పోలీసుల దాన్ని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం సదరు మేక యజమానికి తెలియడంతో పరుగుపరుగనా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. తన మేక ఇప్పించాలని వేడుకోగా మేకకు మాస్క్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇకపై మేకను మాస్కు లేకుండా బయటికి వదిలితే తిరిగిచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చి మేకను వదిలేశారట.

    ఈ వార్త బయటికి తెలియడంతో  ప్రజలు చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం జంతువులకు కూడా కరోనా వస్తుండటంతో పోలీసులు చేసిన పని కరెక్టేనని మద్దతు తెలుపున్నారు. కరోనాపై పోలీసులు చేస్తున్న పోరాటానికి ఈ ఒక్క సంఘటన నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు. మరికొందరేమో మేకకు మాస్కు తొడిగి బయటికి వదిలితే అది మేత ఎలా తింటుందని ప్రశ్నిస్తున్నారు. మాస్కు పెట్టుకోకుండా బయట తిరిగే పోకిరిరాయుళ్లను వదిలేసి.. మూగజీవి మాస్కులేదని పట్టుకెళ్లడం ఏంటని జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎలావున్నా.. పోలీసులు మేకను అరెస్టు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.