https://oktelugu.com/

కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?

తెలంగాణను పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఆమె. తెలంగాణ ఏర్పడకముందు నుంచి జాగృతి పేరుతో గజ్జెకట్టి.. బతుకమ్మను చేతబట్టి.. తెలంగాణ ప్రజలకు చేరువైంది. కానీ ఒక్క ఓటమి ఆమెను కృంగదీసింది.అప్పటి నుంచి కవితకు అదృష్టం కలిసిరావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అంటున్నారు. Also Read: టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా..! ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెకు ఇప్పుడు ఏదీ కలిసిరావడం లేదని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆమెకు అన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2020 / 05:08 PM IST
    Follow us on


    తెలంగాణను పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఆమె. తెలంగాణ ఏర్పడకముందు నుంచి జాగృతి పేరుతో గజ్జెకట్టి.. బతుకమ్మను చేతబట్టి.. తెలంగాణ ప్రజలకు చేరువైంది. కానీ ఒక్క ఓటమి ఆమెను కృంగదీసింది.అప్పటి నుంచి కవితకు అదృష్టం కలిసిరావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అంటున్నారు.

    Also Read: టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా..!

    ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెకు ఇప్పుడు ఏదీ కలిసిరావడం లేదని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆమెకు అన్ని అవకాశాలను టీఆర్ఎస్ కల్పించినా అధికారం మాత్రం దక్కడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    కవితను నిజామాబాద్ ఎమ్మెల్యేలంతా కలిసి బలపరిచి మరీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఆ ఓట్ల ప్రక్రియ పూర్తయ్యింది. కవితకు ఏకంగా 500 ఓట్లు రాగా.. ప్రత్యర్థి నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి కేవలం 100 ఓట్లు మాత్రమే వచ్చాయి.

    అయితే మెజార్టీ కవితకు ఎంతో ఊరటనిచ్చినప్పటికీ ఆమె మాత్రం శాసనమండలిలో అధ్యక్ష అనలేని పరిస్థితి దాపురించింది. కవతి అధికారికంగా శాసనమండలిలో సభ్యత్వం ఇప్పటిదాకా పొందలేకపోతున్నారు. అధికారం దక్కక నిరీక్షిస్తున్నారు. కవిత ఎమ్మెల్సీగా నెగ్గగానే కరోనా ప్రబలింది. దీంతో అసెంబ్లీని సమావేశ పరిచే అవకాశం లేకుండాపోయింది.

    ఈ కారణంగానే కవిత ఇంకా ఎమ్మెల్సీగా ప్రమాణం చేయలేదు. దీంతో ఆ అధికార హోదా పరపతిని అనుభవించలేకపోతున్నారు. ఇది కవితకు ఓ వింత పరిస్థితిని సృష్టిస్తోంది. ఇప్పటికే ఎంపీగా ఓడిపోయి.. అధికారానికి సంవత్సరన్నరగా దూరం ఉంటోంది కవిత. కేసీఆర్ కూతురు అయ్యి ఉండి పార్టీలో ప్రభుత్వంలో కనీసం ప్రాధాన్యత లేకుండా పోతోంది.

    Also Read: కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

    కేసీఆర్ కుటుంబానికి చెందిన అనేక మంది బంధువులు ఇప్పుడు ప్రగతి భవన్ కారిడార్లలో దర్జాగా పేరు పరపతి.. హోదా, అధికారాన్ని అనుభవిస్తున్నారు. కేసీఆర్ సొంత కూతురు కవిత మాత్రం నిజామాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్తి అరవింద్ చేతిలో ఓడినప్పటి నుంచి శని పట్టినట్టు ఏదీ చేసినా ఆమెకు కలిసిరావడం లేదని ఆమె అభిమానులు వాపోతున్నారు. ఎమ్మెల్సీగా గెలిచినా ప్రమాణం చేయకుండా అధికారానికి కవిత దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే చురుకుగా మారుతున్న కవితకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదని తెలిసింది.