https://oktelugu.com/

తొందరపడిన బాబు బకరా అయ్యారే..!

మనది ఎంత మంచి మనసైనా చేసే సాయం వెనుకా ముందు తెలుసుకొని చేయడం చాలా అవసరం. లేకపోతే సోనూ సూద్ లా సాయం చేసి కూడా నాలుక కరుచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. దానికి తాజా ఉందంతమే నిదర్శనం. చిత్తూరు జిల్లా మదనపల్లి మండంలోని ఓగ్రామంలో రైతు తన ఇద్దరు కూతుళ్ళ సాయంతో పొలం దున్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోకి కొందరు పేదరైతుకు ఎద్దులు కొనుక్కునే స్థోమత లేక, ఇద్దరు కూతుళ్లతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2020 / 05:40 PM IST
    Follow us on


    మనది ఎంత మంచి మనసైనా చేసే సాయం వెనుకా ముందు తెలుసుకొని చేయడం చాలా అవసరం. లేకపోతే సోనూ సూద్ లా సాయం చేసి కూడా నాలుక కరుచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. దానికి తాజా ఉందంతమే నిదర్శనం. చిత్తూరు జిల్లా మదనపల్లి మండంలోని ఓగ్రామంలో రైతు తన ఇద్దరు కూతుళ్ళ సాయంతో పొలం దున్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోకి కొందరు పేదరైతుకు ఎద్దులు కొనుక్కునే స్థోమత లేక, ఇద్దరు కూతుళ్లతో నాగలి పట్టించి వ్యవసాయం చేస్తున్నారని ఓ ఎమోషనల్ స్టోరీ అల్లారు. ఆ వీడియో గంటల వ్యవధిలో నటుడు సోనూ సూద్ దృష్టికి వెళ్ళింది. దానితో ఆ పేద రైతుకు కావలసింది ఎద్దులు కాదని, ట్రాక్టర్ అని ఆయన వెంటనే ఓ కొత్త ట్రాక్టర్ సదరు రైతు ఇంటికి పంపారు.

    Also Read: ఆ జిల్లాలో టీడీపీ కనుమరుగు కానుందా?

    ఐతే ఈ సంఘటనలో ప్రచారం అయినట్లు ఎమోషనల్ పార్ట్ లేదని వాస్తవంలోకి వెళ్ళాక వెలుగు చూసింది. నిజానికి ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ రైతు ఎద్దులు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పేదవాడు కాదట. ఆ అమ్మాయిలు కుడా ఆ పనిని కేవలం సరదా కోసం చేశారట. కరోనా వైరస్ కారణంగా సొంత ఊరికి వచ్చిన ఆ ఇద్దరు అమ్మాయిలు సరదాగా ఆ వీడియో చిత్రీకరించారట. మండల ఎంపీడీవో స్వయంగా ఈ సంఘటనపై విచారణ చేయగా వాస్తవాలు బయటికి వచ్చాయి. తమకు సోనూ సూద్ పంపిన ట్రాక్టర్ ని కూడా ఆ కుటుంబం గ్రామ పంచాయితీకి అప్పగించనున్నట్లు తెలుస్తుంది.

    Also Read: ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించను.. అవంతి

    ఐతే ఈ సంఘటనలో మరో ట్విస్ట్ ఉంది. సోనూ సూద్ సాయం గురించి తెలుసుకున్న బాబు సంఘటను క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిపోయారు. ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ ని పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి సోనూ సూద్ సైతం మీరే నాకు స్ఫూర్తి అని చెప్పడంతో లోకేష్ బాబు ఉబ్బితబ్బిబై ఆయన ట్వీట్ రీట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ సోనూ సూద్ సాయాన్ని పొగడడంతో పాటు, వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని నిరూపించే ప్రయత్నం బాబు చేశారు. ఐతే జరిగిన సంఘటనలో వాస్తవం తెలుసుకొని తొందరపడ్డాం అని నాలుక కరుచుకోవడం బాబు వంతు అయ్యింది. మొత్తంగా ఆ అమ్మాయిలు సరదాగా చేసిన పనితో సోనూ సూద్ కంటే కూడా బాబునే బకరా అయ్యారనేది రాజకీయ వర్గాల్లో టాక్.